Site icon HashtagU Telugu

Chapati : చపాతీలు బాగా రావాలంటే పిండి నుంచి కాల్చేదాకా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Follow These Precautions for Making Good Chapati

Follow These Precautions for Making Good Chapati

భారతీయులు తినే ఆహారంలో చపాతీలను(Chapati) ఎక్కువగా తింటూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ అయితే తప్పకుండా చపాతీలను(Roti) రోజూ తింటారు. దక్షిణాది రాష్ట్రాలలో చపాతీలను భోజనంతో పాటు మరియు టిఫిన్ సమయంలో కూడా తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ లో అయినా చపాతీని తప్పకుండా పెడుతున్నారు. అయితే మనం చపాతీలను చేసేటప్పుడు, చపాతీ పిండి కలిపేటప్పుడు, చపాతీలను నిలువ చేయడానికి కొన్ని జాగ్రత్తలను పాటిస్తే చపాతీలు ఎంతో రుచిగా ఉంటాయి.

చపాతీలు చేయడానికి ఉపయోగించే పిండి రకాలు చాలా ఉన్నాయి. మామూలు గోధుమపిండి నుండి మల్టీ గ్రైన్ గోధుమపిండి వరకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. అయితే మనం ఒక రకమైన ధాన్యంతో చేసిన పిండిని ఉపయోగిస్తేనే మన ఆరోగ్యానికి మంచిది. చపాతీ పిండి కలుపుకున్న తరువాత ఒక అరగంట సమయం అలాగే మూత పెట్టి ఉంచి ఆ తరువాత చపాతీలు చేసుకుంటే అవి మన ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే ఇలా కాసేపు ఉంచడం వలన దానిలో మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

ఇప్పుడు చాలామంది నాన్ స్టిక్ పెనాలను వాడుతున్నారు కానీ ఇనుప పెనాల మీద కాల్చిన చపాతీలు మన ఆరోగ్యానికి మంచివి. చపాతీలను వేడిగా ఉంచడానికి సిల్వర్ ఫాయిల్ లో చుట్టి పెడుతున్నారు. కానీ సిల్వర్ ఫాయిల్ లో చపాతీలను పెట్టడం అనేది మంచి పద్దతి కాదు. చపాతీలు వేడిగా మెత్తగా ఉండడానికి వాటిని సిల్వర్ ఫాయిల్ లో కాకుండా క్లోత్ లో చుట్టి ఉంచవచ్చు. ఈ విధంగా చపాతీలను తయారుచేయడానికి వాడే పిండి, చపాతీలు చేయడానికి కలిపే పిండి, చపాతీలు కాల్చడానికి ఉపయోగించే పెనం అన్నిటి గురించి జాగ్రత్తలు తీసుకుంటే చపాతీలు ఎక్కువసమయం వేడిగా మరియు మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి.

 

Also Read : Kakarakaya Podi : నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో తెలుసుకోండి..