Pains while Working : కంప్యూటర్ పనితో ఆ నొప్పులతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

అదే పనిగా రోజూ కొన్ని గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల మెడ నొప్పి, చేతి నొప్పులు, వెన్ను నొప్పి(Bacj Pain) వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 07:30 PM IST

ఇటీవల కాలంలో చాలామంది కంప్యూటర్(Computer) ముందే పని చేస్తున్నారు. దీనివల్ల అనేక రకాల నొప్పులు(Pains), ఆరోగ్య సమస్యలు(Health Issues) కూడా వస్తున్నాయి. అదే పనిగా రోజూ కొన్ని గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల మెడ నొప్పి, చేతి నొప్పులు, వెన్ను నొప్పి(Back Pain) వస్తున్నాయి. మరికొంతమంది ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్లకు కూడా ఇలాంటి నొప్పులు వస్తున్నాయి.

అయితే అలాంటి నొప్పులను అలాగే వదిలేయకుండా మనం సొంతంగా చేసే చిన్న చిన్న పనుల ద్వారా తగ్గించుకోవచ్చు.

#వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు పని మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చి ఒక 5 నిమిషాలు పడుకోవడం మంచిది.
#నొప్పిగా అనిపించిన ప్రాంతంలో కొన్ని ఐస్ ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి మసాజ్ లాగా చేయాలి. ఇలా ఒక 10 నిముషాలు చేయడం వలన నొప్పి తగ్గుతుంది.
#పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో చేతులని అటూ, ఇటూ తిప్పాలి. చేతులకు సంబంధించిన వ్యాయామం చేయాలి.
#కంప్యూటర్ ముందు కూర్చునే వారు కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. చాలా మంది కుర్చీలో వాలిపోయి, పడుకొని పని చేస్తూ ఉంటారు. దానివల్ల వెన్ను నొప్పి వస్తుంది. కాబట్టి నిటారుగా కూర్చొని పని చేస్తే వెన్ను నొప్పిని దూరం పెట్టొచ్చు.
#పని మధ్యలో మన తలని కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అలాగే స్క్రీన్ వైపు చూస్తూ పని చేయకుండా కనీసం అరగంటకి ఒకసారైనా తలను పైకి, కిందకు, అటూ, ఇటూ తిప్పుతూ ఉండాలి.
#పని మధ్యలో గంటకి ఒకసారైనా లేచి ఒక 2 నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే మంచిది. అదేపనిగా కూర్చోవడం వల్ల పట్టేసిన కండరాలు వదులవుతాయి.
#రోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది. ఎలాంటి నొప్పులు ఉన్నా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది.
#అలాగే నొప్పిగా అనిపించిన చోట వేడి నీటి కాపడం పెట్టినా కూడా ఉపశమనం కలుగుతుంది.

మనం చేసే పనులతో వెన్ను, మెడ, చేతుల నొప్పులు వస్తే ఇవి పాటించి నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవి చేసినా ఇంకా నొప్పి తగ్గకపోయినా, నొప్పి ఎక్కువగా అనిపించినా వైద్యుడిని కలవడం మంచిది.

 

Also Read ;   Manage Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?