Curd Face Pack : ముఖం మెరిసిపోయే పెరుగు ఫేస్ ప్యాక్.. వీటితో కలిపి వేసుకోండి..

ఈ సమ్మర్ లో బయటికి వెళ్తే ఫేస్ ఊరికే ట్యాన్ అయిపోతుంటుంది. ముఖాన్ని పెరుగు మెరిసేలా చేస్తుంది. పెరుగులో కొన్నింటిని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చాలా బాగుంటుంది.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 07:15 PM IST

అందం అందరికీ కావాలి. అందం మీద అందరికీ మక్కువ ఎక్కువ. మగువలకైతే అందం అంటే చచ్చేంత ఇష్టం. ఒకరి కంటే ఒకరు అందంగా కనిపించాలని తపిస్తుంటారు. అలాగే బ్యూటీకేర్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ సమ్మర్ లో బయటికి వెళ్తే ఫేస్ ఊరికే ట్యాన్ అయిపోతుంటుంది. ముఖాన్ని పెరుగు మెరిసేలా చేస్తుంది. పెరుగులో కొన్నింటిని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చాలా బాగుంటుంది.

పెరుగులో బాదంపొడి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మెరుపుని ఇస్తుంది. 10-15 బాదంపప్పులు తీసుకుని, వాటిని గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇది 10-15 రోజులు నిల్వ ఉంటుంది. ఇన్ స్టంట్ గా ఫేస్ గ్లో రావాలంటే.. పెరుగు – బాదంపొడి ఫేస్ ప్యాక్ ను వాడండి.

అలాగే.. బొప్పాయి కూడా చర్మంపై మురికిని పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. 2:1 రేషియోలో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మీ ముఖం చాలా ఫెయిర్ గా కనిపిస్తుంది.

నారింజ తొక్కలతో చాలా ప్రయోజనాలున్నాయి. వాటిని ఎండబెట్టి.. పొడిచేసి.. అందులో పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. కాంతివంతంగా కనిపించడంతో పాటు మాయిశ్చర్ గా కూడా ఉంచుతుంది.

గంధం పొడి – పెరుగు ఫేస్ ప్యాక్ సౌందర్యాన్ని పెంచుతుంది. మృతకణాలను తొలగించి.. ఛాయను పెంచుతుంది. చల్లదనాన్ని ఇస్తుంది. గంధం చర్మానికి చాలా మంచిది.

టొమాటో రసం – పెరుగు బెస్ట్ ఫేస్ ప్యాక్ అని చెప్పాలి. ఇన్ స్టెంట్ గ్లో ఇస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పార్టీకో, ఫంక్షన్ కో వెళ్లేటపుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ఇన్ స్టంట్ గ్లో మీ సొంతం.

Also Read : Cooking: వాడిన నూనెతో మళ్లీ వంట చేస్తున్నారా.. అయితే మీకు ఈ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం