Tips to follow while Entering into New House : ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అన్నది ఉంటుంది. చనిపోయే లోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి (House) గృహప్రవేశం చేసినప్పుడు అనేక రకాల సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి (House) ప్రవేశించినప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటున్నారు పండితులు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శుభ దినం, శుభ ముహూర్తంతో కొత్త గృహ ప్రవేశం చేయడం చాలా ముఖ్యం. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, సంఖ్యా శాస్త్రం, చంద్ర దశ, క్యాలెండర్ లేదా రాశి ఆధారంగా గ్రహ ప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు. ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సంతోషాలు నెలకొంటాయని హిందువుల విశ్వాసం. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువుల్లో ఉపయోగించడం మంచిది. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు.
ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయడం వల్ల ఇంట్లో తిండికి లోటుండదని నమ్ముతారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూమతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత, ఆ పాలను ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు ఆ పాలతో తీపి వంటకం తయారు చేసి పెడతారు. అలాగే కొత్త ఇల్లు కట్టినప్పుడు, ఆవు అంటే కామధేనువుని గృహ ప్రవేశం రోజు తీసుకువెళతారు. ఈ సమయంలో ఆవును పూజించి, పూలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారం గుండా తీసుకెళతారు. ఆవును ఇంటికి తీసుకెళ్లడం ద్వారా మూడు కోట్ల మంది దేవతలు ఇంట్లోకి ప్రవేశించినట్లే అని నమ్ముతారు. తర్వాత ఆవుకు మిఠాయిలు నైవేద్యంగా పెట్టి ఆ రోజు తొలి ఆహారాన్ని ఆవుకు నైవేద్యంగా పెట్టి హారతి ఇస్తారు. గృహ ప్రవేశ పూజ అనేది హిందూ దేవతలు నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం.
కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు, శక్తిని శుద్ధి చేయడానికి, ఇంటిని సానుకూల శక్తితో నింపడానికి పూజ సమయంలో కొత్త కలశాన్ని ఉంచి గణపతి పూజ, వాస్తు దోష పూజ, నవగ్రహ శాంతి పూజల తర్వాత హవనం నిర్వహిస్తారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే దేవుడి పటం తెచ్చి పెడతారు. కొత్త ఇంట్లోని దేవుని గదిలో భగవంతుడి చిత్రపటాన్ని ఉంచడం చాలా శుభప్రదం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దానధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళిలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు తదితరాలను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. పేదలకు కూడా వారికి చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు ఇస్తారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దుస్తులు అందజేస్తారు.
Also Read: Turmeric Tips : ముఖానికి పసుపు రాసుకుంటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..