మామూలుగా చాలామంది గుడ్డుతో చేసిన రెసిపీలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎగ్ దమ్ బిర్యాని కూడా ఒకటి. బయట హోటల్లో దీని ప్రైస్ చాలా ఎక్కువగా చెబుతుంటారు. దాంతో చాలామంది బయట తినలేక దీన్ని ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ రెసిపీ ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏమేం కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
కావాల్సిన పదార్ధాలు:
కొత్తిమీర – పావు కప్పు
పుదీనా – పావు కప్పు
వేపిన ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
ఉడికించిన గుడ్లు – అయిదు
దాల్చిన చెక్క – ఒకటి
లవంగాలు – అయిదు
యాలకులు – నాలుగు
షాహీ జీరా – ఒక టీ స్పూన్
అనాస పువ్వు – రెండు
బిర్యానీ ఆకులు – రెండు
నల్ల యాలుక – ఒకటి
ఉప్పు – తగినంత
కారం – రెండు టీ స్పూన్స్
ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
వేపిన జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా – ముప్పావు టేబుల్ స్పూన్
అల్లం వెల్లులి ముద్ద – ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి చీలికలు – నాలుగు
పెరుగు – అర కప్పు
ఉల్లిపాయలు – సరిపడా
నూనె – పావు కప్పు
నీళ్ళు – రెండు లీటర్లు
దాల్చిన చెక్క – రెండు
అనాసపువ్వు – రెండు
నిమ్మకాయ – ఒకటి
ఉప్పు – 2.5 టేబుల్ స్పూన్
పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్స్
Also Read:Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?
తయారీ విధానం:
ఇందుకోసం మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని ఒక గిన్నె లోకి తీసుకుని అందులో మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుతూ కోడి గుడ్లకి పట్టించాలి. ఎసరు నీళ్ళలో ఉప్పు, మసాలా దినుసులన్నీ వేసి 2-3 నిమిషాలు మరగనివ్వాలి. తరువాత బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి చీలికలు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి 90% ఉడికించుకోవాలి. ఉడికిన అన్నాన్ని మసాలా దినుసులతో పాటు వడకట్టి ముందుగానే కలిపి పెట్టుకున్న కోడి గుడ్ల మసాలా మీద వేయాలి. బిర్యానీ రైస్ మీద నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు, గరం మసాలా, పుదీనా తరుగు వేసి ధమ్ బయటకి పోకుండా గట్టిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ధమ్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు వదిలేయాలి. అంతే ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ దమ్ బిర్యాని రెడీ.
Also Read: Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!