Smoking : సిగరెట్ తాగడమే ఆరోగ్యానికి హానికరం. అయినా కొంతమంది రెగ్యులర్ గా సిగరెట్స్ తాగుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇంట్లో లేదా బయట కొన్ని ప్రదేశాల్లో AC రూమ్స్ లో కూడా సిగరెట్ తాగుతూ ఉంటారు. అది ఇంకా ప్రమాదకరం.
AC గదుల్లో సిగరెట్స్ తాగడం వల్ల కలిగే నష్టాలు..
* AC గదుల్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం వలన AC పేలిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయట.
* AC గదులు క్లోజ్డ్ గా ఉండడం వలన సిగరెట్ పొగ దాని నుండి వెలువడిన వేడి తిరిగి మనం పీల్చే గాలిలోనికే వస్తుంది.
* AC గదిలో ఎవరైతే ఉంటారో సిగరెట్ తాగేవారే కాదు అవతలి వారికి కూడా ఆరోగ్యానికి హానికరం.
* AC గదిలో సిగరెట్ తాగడం వలన తొందరగా రూమ్ చల్లబడదు.
* AC గదిలో ఎక్కువగా సిగరెట్ తాగడం వలన నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
* AC గదిలో తలుపులు, కిటికీలు మూసి ఉండడం వలన ఇంటి లోపల ఉండే గాలి, సిగరెట్ కాల్చడం వలన వచ్చే వేడి గాలి తిరిగి మన శరీరంలోనికి వస్తాయి. దీని వలన ఆ గాలి మన శరీరంలోని ఊపిరితిత్తులలోనికి పోయి శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య పరోక్షంగా ఆ గదుల్లో ఉండే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంది.
* AC గదుల్లో సిగరెట్ తాగి వెళ్ళిపోయినా చాలా సమయం వరకు ఆ రూమ్ అంతా ఆ సిగరెట్ స్మెల్ తోనే ఉంటుంది. అది ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్ తాగేవాళ్ళు AC రూమ్స్ లో తాగకండి. మీతో పాటు ఇతరులను ఇబ్బంది పెట్టకండి.
Also Read : Hungry : ఆకలిని అదుపు చేయాలంటే వీటిని తినండి…