Site icon HashtagU Telugu

Palak Paneer Pakodi : పాలకూర పన్నీర్ తో పకోడీలు.. చల్లని సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్

palak paneer pakoda

palak paneer pakoda

Palak Paneer Pakodi : పాలకూర, పన్నీర్ తో కూర వండుకుని తిని ఉంటారు. కానీ.. ఈ రెండింటి కాంబినేషన్ తో ఎప్పుడూ స్నాక్స్ చేసి ఉండరు కదా. ఇదేదో కొత్తగా ఉందే.. ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా ? రుచికి చాలా బాగుంటుంది. రొటీన్ పకోడీల కంటే కమ్మగా ఉంటాయి. మరి పాలక్ పన్నీర్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు ఏవేం కావాలో తెలుసుకుందాం.

పాలక్ పన్నీర్ పకోడీకి కావలసిన పదార్థాలు

పాలకూర – 1 కట్ట

శనగపిండి – 1 కప్పు

ఉప్పు – రుచికి తగినంత

జీలకర్ర – 1 స్పూన్

ధనియాలపొడి – 1 స్పూన్

వాము – 1/4 టీ స్పూన్

జీలకర్ర పొడి – 1 స్పూన్

ఇంగువ – చిటికెడు

పాలక్ పన్నీర్ పకోడీ తయారు చేసుకునే విధానం

పాలకూరను శుభ్రం చేసుకుని నీరంతా పోయేలా ఆరబెట్టుకోవాలి. వాటి కాడల్ని తీసేసి ఆకుల్ని సన్నగా తరుగుకోవాలి. ఒక గిన్నెలో కట్ చేసుకున్న పాలకూర తరుగు, శనగపిండి, పన్నీర్ ముక్కలు, పైన చెప్పిన క్వాంటిటీలో జీలకర్ర, ధనియాలపొడి, జీలకర్రపొడి, ఇంగువ వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.

ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పకోడీ టెక్చర్ వచ్చేలా కలుపుకోవాలి. కళాయిలో నూనె పోసి.. వేడియ్యాక.. స్పూన్ తో పకోడీలను ఆయిల్ లో వేసుకోవాలి. ప్రతీ పకోడీలో పన్నీర్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దాని రుచి బాగుంటుంది. మీడియం మంటపై పకోడీలను ఎర్రగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుంటే చాలు. పాలక్ పన్నీర్ పకోడీ రెడీ.

Read Also : Fruit Juice vs Fruit: పండ్లు మంచివా..? లేక జ్యూస్ మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?