Site icon HashtagU Telugu

Laptop : లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా..? దానివల్ల వచ్చే సమస్యలు..

Dont Keep Laptop on your Lap while Working it Causes Health Issues

Laptop

Laptop : ఈ రోజుల్లో లాప్‌టాప్ లో వర్క్ చేయడం చాలా కామన్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ వాళ్ళు మాత్రమే కాక చాలా మంది లాప్‌టాప్ లోనే పనిచేస్తున్నారు. అయితే ఆఫీస్ లో టేబుల్ మీద లాప్‌టాప్ పెట్టుకొని పనిచేస్తే పర్లేదు. కానీ వర్క్ ఫ్రమ్ హొమ్ చేసే వాళ్ళు మాత్రం ఇంట్లో కంఫర్ట్ కోసం లాప్‌టాప్ ని ఒళ్ళో పెట్టుకొని పనిచేస్తున్నారు. చాలా మంది ఇంట్లో వర్క్ చేస్తే లాప్‌టాప్ ని ఒళ్ళోపెట్టుకొనే పనిచేస్తున్నారు.

కానీ లాప్‌టాప్ ని మన ఒడిలో పెట్టుకొని వర్క్ చేయకూడదు. ఎందుకంటే దీని వలన మనకు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది.

* లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వలన టోస్టడ్ స్కిన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.
* లాప్‌టాప్ ని ఒడిలో పెట్టుకొని వాడడం వలన లాప్‌టాప్ నుండి వచ్చే వేడికి పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. దీని వలన సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* లాప్‌టాప్ ని ఒడిలో పెట్టుకోవడం వలన మన కంటికి దగ్గరగా ఉంటుంది. దీని వలన కళ్ళు పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* లాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేసినప్పుడు వంగొని వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి నడుం నొప్పి, మెడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
* లాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వలన మన శరీరానికి ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగేలా చేస్తుంది.
* లాప్‌టాప్ మన ఒడిలో పెట్టుకొని వర్క్ చేస్తే మన శరీరం యొక్క పొజిషన్ దెబ్బతింటుంది.
* లాప్‌టాప్ ని ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వలన తొందరగా లాప్‌టాప్ కూడా వేడి ఎక్కుతుంది.
* గర్భిణీ స్త్రీలు లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వలన పొట్టలోని బేబీకి హాని కలిగే అవకాశం కూడా ఉంది.

కాబట్టి ఎప్పుడూ మనం లాప్‌టాప్ లో వర్క్ చేసుకున్నా ఏదయినా టేబుల్ మీద పెట్టుకొని చేసుకోవాలి అంతేకాని మన ఒడిలో లాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేయకూడదు.

Also Read : Pizza : పిజ్జా తినడం వల్ల కలిగే నష్టాలు ఇన్ని ఉన్నాయా..?