Site icon HashtagU Telugu

Sleeping Tips: మీరు లైట్ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి

Do You Sleeping With The Light On But Be Careful..

Do You Sleep With The Light On But Be Careful..

చాలామందికి, రాత్రిపూట లైట్‌ ఆన్‌ చేసుకుని నిద్రపోయే (Sleeping) అలవాటు ఉంటుంది. చీకటి అంటే భయం వల్ల కావచ్చు, లైట్‌ ఆన్‌లో ఉంటేనే నిద్రపట్టడం వల్ల కావచ్చు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా..? కేవలం గదిలోని లైట్‌ వల్లకాదు.. టీవి, ల్యాప్‌టాప్‌ కాంతి కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 అధ్యయనం ప్రకారం, లై‌ట్‌ ఆన్‌ చేసుకుని నిద్రపోయే (Sleeping) వాళ్లకి.. నిద్రబాగనే పడుతుందని, అయితే.. వాళ్లు డీప్‌ స్లీప్‌లోకి తక్కువగా వెళ్తున్నారని బ్రెయిన్‌ రికార్డింగ్‌లలో వెల్లడైంది. వారి జీవక్రియ, గుండెపైనా ప్రభావం పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఒకరోజు రాత్రి లైన్‌ వేసుకుని నిద్రపోయిన వారికి కూడా.. ఇన్సులిన్ నిరోధకత పెరిగినట్లు గుర్తించారు. వారి రక్తనమూనాలు పరీక్షంచగా ఇది బయటపడింది. లైట్‌ ఆన్‌ చేసుకుని నిద్రపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలుసుకుందాం.

ఊబకాయం ముప్పు

చికటిలో నిద్రపోయేవారి కంటే.. టీవీ/ లైట్స్‌ ఆన్‌ చేసుకుని పడుకునే వారికి ఊబకాయం ముప్పు ఎక్కువగా ఉంటుందని మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

డిప్రెషన్‌

రాత్రిపూట లైట్లు వేసుకుని నిద్రపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది. లైట్‌ వేసుకుని నిద్రపోయేవారికి మానసిక కల్లోలం, చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాల వాడేవారికి.. వాటి నుంచి వెలువడే బ్లూ లైట్‌ .. మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

షుగర్‌ ముప్పు

రాత్రి పూట లైట్‌ వేసుకుని నిద్రపోయేవారికి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఓ తాజా అధ్యయనం గుర్తించింది. వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగినట్లు పేర్కొన్నారు. దీని కారణంగా.. మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.

గుండె జబ్బులు ప్రమాదం

లైట్‌.. బాడీ క్లాక్‌కు భంగం కలిగేలా చేస్తుంది, బయోమెకానికల్ మార్పులకు కారణమవుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇలా చేయండి

మీరు లైట్‌ లేకుండా నిద్రపట్టకపోతే.. సాధారణ లైట్‌కు బదులుగా.. రెడ్‌ బల్బ్‌ను వాడండి. రెడ్ లైట్ బల్బులు.. ఇతర బల్బులలా.. మెలటోనిన్ ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపదని గుర్తించారు. కానీ, ఈ లైట్‌ను కూడా దీర్ఘకాలం పాటు వాడకూడదు.

Also Read:  Amnesia Diet: మతిమరుపు తగ్గడానికి ఈ స్పెషల్ ఫుడ్స్ మీకోసమే.