Scold: తల్లిదండ్రులు తరచుగా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా తమ మూడ్ బాగోలేనప్పుడు సమయం సందర్భం చూడకుండా పిల్లలపై అరుస్తుంటారు. అయితే కొన్ని ప్రత్యేక సమయాల్లో పిల్లలను అస్సలు మందలించకూడదని చైల్డ్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా వారిని ఏయే సమయాల్లో తిట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేచిన వెంటనే
పిల్లలు ఉదయం నిద్రలేచిన వెంటనే వారిని ఎప్పుడూ తిట్టకూడదు. చైల్డ్ సైకాలజీ ప్రకారం.. ఆ సమయంలో వారి రోజంతా ఉండే ఎమోషనల్ టోన్ సెట్ అవుతుంది. ఉదయమే తిట్టడం వల్ల వారి రోజంతా పాడైపోయే అవకాశం ఉంటుంది.
Also Read: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
స్కూలుకు వెళ్లే ముందు
స్కూలుకు బయలుదేరే ముందు పిల్లలను మందలిస్తే మీరు అన్న మాటలనే వారు రోజంతా గుర్తుంచుకుంటారు. దీనివల్ల వారు స్కూల్లో చదువుపై దృష్టి పెట్టలేరు. ఆ బాధ లేదా ఆలోచన వారిని రోజంతా వెంటాడుతుంది.
స్కూలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత
పిల్లలు స్కూలు నుండి ఏ మూడ్‌లో వచ్చారో మనకు తెలియదు. వారు బాగా అలసిపోయి ఉండవచ్చు లేదా ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అందుకే స్కూలు నుండి రాగానే వారిని తిట్టడం కంటే, వారికి మానసిక భద్రతను కల్పించడం ముఖ్యం.
పడుకునే ముందు
రాత్రి నిద్రపోయే ముందు మన ఉపచేతన మనస్సు చాలా చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలను తిడితే, మీరు అన్న బాధాకరమైన మాటలు వారి మనసులో బలంగా ముద్రపడిపోతాయి. ఇది వారి నిద్రను, మానసిక స్థితిని దెబ్బతీస్తుంది.
పిల్లలు మారం చేస్తున్నప్పుడు
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వారిని తిట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ సమయంలో వారికి మీ క్రమశిక్షణ కంటే మీ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం. వారితో ప్రేమగా మాట్లాడి శాంతింపజేయడానికి ప్రయత్నించాలి.
