Site icon HashtagU Telugu

Mobile phone : మీరు నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా?..నష్టాలివే..!

Mobile Phobia

Mobile Phobia

Mobile phone : ఫోన్ ఉపయోగించడం ప్రమాదమని నిపుణులంటున్నారు. మరీ ముఖ్యంగా.. ఉదయాన్నే నిద్రలేచి మొబైల్‌ ఫోన్‌ చూడటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్నే లేవగానే మన మెదడులో కార్టిసాల్ లెవెల్స్ అధిక మోతాదులో విడుదల అవుతాయి. అలాగే బ్రెయిన్ యాక్టివ్​ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది. కానీ మీరు పొద్దున్నే లేచి లేవగానే ఫోన్ చూస్తే.. బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి టైమ్ దొరకదు. కార్టిసాల్ స్ట్రెస్​ని కూడా పెంచేస్తుంది. ఇది ఒబెసిటీ, అధికబరువుకు దారితీస్తుంది. పైగా ఫోన్​లో ఏ నెగిటివ్ వార్తను చూసినా.. ఆ రోజు అది మీ మూడ్​ని ఏదొకరకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందని గుర్తించుకోవాలి.

Read Also: New EPFO Rules: పీఎఫ్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఇక‌పై!

గుండె సమస్యలు పెరుగుతాయి..

మొబైల్‌ ఫోన్‌ చూడటం వల్ల మీరు చేయాలనుకున్న టాస్కులు కంప్లీట్ చేయలేరు. కళ్లు లాగుతుంటాయి. తలనొప్పి వస్తుంది. నీరసం, అలసట వస్తాయి. స్ట్రెస్ పెరగడం వల్ల నిద్ర సమస్యలు పెరగడంతో పాటు రోగనిరోధకశక్తి తగ్గుతుంది. గుండె సమస్యలు పెరుగుతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ పెరుగుతుంది. ఫోన్‌ చూటడం వల్ల బ్రెయిన్ యాక్టివ్​ అవ్వకపోవడం వల్ల డే అంతా మీరు కొన్ని విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేనిపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు. ప్రొడెక్టివిటీ తగ్గిపోతుంది. ఇక, నైట్‌ సమయంలో స్క్రీన్‌ చూడటం వల్ల మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని ఎక్సపరిమెంటల్‌ బ్రెయిన్‌ రీసర్చ్‌ 2018లో ఓ నివేదికను విడుదల చేసింది. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, దీర్ఘకాలిక మైగ్రేన్‌ వంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు తెలిపారు.

నిద్రలేచిన వెంటనే మెడిటేషన్​ లేదా బాడీ స్ట్రెచ్

నిద్రలేచిన వెంటనే మెడిటేషన్​ లేదా బాడీ స్ట్రెచ్ చేయడం వల్ల మెటబాలీజం కూడా పెరుగుతుంది. నీళ్లు తాగుతూ ఫోన్ చూడాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మిలో కాస్త సమయం స్పెండ్ చేయండి. ఇది మీ మూడ్​ని, సర్కియాడియన్ రిథమ్​ని మెరుగుపరుస్తుంది. మీ రోజులో ఏ పనులు చేయాలనుకుంటున్నారో వాటిని టాస్క్​లుగా రాసుకోవచ్చు లేదా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని యాక్టివ్​గా చేసి.. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. మీ శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఓ గ్లాస్ వాటర్ తాగండి. దీనివల్ల యాక్టివ్​ అవుతారు. పడుకునే ముందు ఫోన్​ని మీ బెడ్​కి దూరంగా పెట్టుకోండి. అలారం కోసం ఫోన్ ఉపయోగిస్తుంటే అలారం క్లాక్ కొనుక్కోండి. మీ ఉదయాన్నే ఓ బుక్​తో లేదా ఓ జర్నల్​తో ప్రారంభం చేసుకోండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌ను వాడకుండా, కుటుంబ సభ్యులతో గడపండి. ఇలా చేయడం వల్ల మొబైల్‌ ఫోన్‌ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి

 

 

Exit mobile version