Christmas Cake : క్రిస్మస్‌ ప్లమ్ కేక్ చరిత్ర తెలుసా?

ప్లమ్ కేక్ (Plum Cake) నచ్చనివారు దాదాపు ఉండరు. క్రిస్మస్ (Christmas) రాగానే ఆ కేక్ (Cake) తినాలని ప్లాన్ చేసుకుంటారు.

ప్లమ్ కేక్ (Plum Cake) నచ్చనివారు దాదాపు ఉండరు. క్రిస్మస్ (Christmas) రాగానే ఆ కేక్ (Cake) తినాలని ప్లాన్ చేసుకుంటారు. భారీ ఎత్తున కేక్ పార్టీలు చేస్తారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ కేక్ వెనక పెద్ద చరిత్రే ఉంది. మధ్యయుగకాలంలో ఇంగ్లండ్‌ (England)లో క్రిస్మస్ (Christmas) వచ్చే ముందు ఉపవాసం చేసేవారు. ఇష్టమైన ఆహారాలను దూరం పెట్టేవారు. తద్వారా క్రిస్మస్ నాటికి ఎక్కువ తినేలా ప్లాన్ చేసుకునేవారు.

ఆచారం ప్రకారం క్రిస్మస్ నాడు భారీ పొర్రిడ్జ్ (Porridge) వండేవారు. దీన్ని ఓట్స్, డ్రై ఫ్రూట్స్ (Dry Fruits), సుగంధద్రవ్యాలు, తేనె (Honey)తో తయారుచేసేవారు. దీన్ని క్రిస్మస్ తాత అని పిలిచేవారు. కాలక్రమంలో ఇదే ప్లమ్ కేక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో చాలా రకాల పదార్థాలు కలుపుతున్నారు. 6వ శతాబ్దంలో కొన్నాళ్లు ఓట్స్ (Oats) బదులు మైదా (Maida), గుడ్లు (Eggs), వెన్న (Butter)ను చేర్చారు. ఈ మిశ్రమాన్ని ఓ మస్లిన్ గుడ్డలో ఉంచి కుండలో చుట్టి నీరు ఉన్న కుండలో ఉంచి కొన్ని గంటల పాటూ ఉడికించేవారు. అలా భారీ కేక్ తయారయ్యేది. సంపన్నులకు సొంతంగా ఓవెన్ ఉండేది. వారు ఉడికించకుండా బేకింగ్ చేసేవారు. ఇలా ప్రతీ కుటుంబమూ కేక్ తయారు చేసేది. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్, ఒక్కో రుచితో ఉండేవి.

Also Read:  Canara Bank: కెనరా బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త..!

రిచ్ కేక్ (Rich Cake) లేదా పుడ్డింగ్‌ (Pudding)ని క్రిస్మస్‌కి కొన్ని వారాల ముందే తయారుచేసేవారు. దాన్ని వేడుకలు జరుపుకునే 12వ రోజు వరకూ అలాగే ఉంచి ఆ రోజున సెర్వ్ చేసుకునేవారు. ఇంతకీ దీన్ని కేక్ అని కాకుండా ప్లమ్ కేక్ అని ఎందుకు అంటున్నారు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఇంగ్లండ్‌లో కిస్‌మిస్‌ (Raisins)ని ప్లమ్స్ అని కూడా అంటారు. కేక్‌లో కిస్‌మిస్ వేస్తారు. అందువల్ల అలా పిలుస్తున్నారు అనుకోవచ్చు. 19వ శతాబ్దంలో ఈ కేక్ విషయంలో కొంత వివాదం చెలరేగింది. 12వ రోజున వేడుకలు జరుపుకోవడాన్ని విక్టోరియా రాణి నిషేధించారు. క్రిస్మస్ నాడే వేడుకలు జరుపుకోవాలని ఆదేశించారు. దాంతో పండుగ నాడే కేక్ వాడకం జోరందుకుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia), అమెరికా (America), కెనడా (Canada), యూరప్ (Europe) దేశాల్లో కొన్ని నెలల ముందు నుంచే కేక్స్ తయారీ జరుపుతున్నారు. తయారీదార్లు భారీ ఎత్తున ఆర్డర్లు పొందుతున్నారు. ఈ రోజుల్లో క్రిస్మస్‌కి ప్లమ్ కేక్ (Plum Cake), వైన్ బాటిల్‌ (Wine Bottle)ను విదేశాల్లో సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ప్లమ్ కేక్ (Plum Cake) లేని దేశం లేదు. ప్రతీ ప్రాంతంలో ఈ కేకులను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నారు. క్రిస్మస్ నాడు మాత్రమే కాకుండా.. సంవత్సరమంతా వీటి అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రిస్మస్‌ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో జరుపుకుంటూ ప్లమ్ కేక్ (Plum Cake) తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎంచుకొని ఆనందంగా పండుగ చేసుకోండి.