Phones Vs Wallets : చాలామంది ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్‌ను వ్యాలెట్‌లా వాడేస్తున్నారు. బ్యాక్ కవర్ లోపల డబ్బులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను దాచేస్తున్నారు. వాస్తవానికి అలా చేయడం మంచిది కాదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. దీనివల్ల అసలుకే ఎసరు రావచ్చని.. ఫోన్ పేలిపోయే రిస్క్ ఉంటుందని చెబుతున్నారు. అంతదాకా పోకముందే అందరూ ఫోన్ బ్యాక్ కవర్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులను ఉంచడాన్ని ఆపేయాలి.
We’re now on WhatsApp. Click to Join
ప్రతి దానికి ఒక పరమార్ధం ఉంటుంది. ఫోన్ బ్యాక్ కవర్‌లో డబ్బులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను దాచడానికి కూడా ఒక పరమార్థం ఉంది. అదేమిటంటే.. అత్యవసరం. ఎమర్జెన్సీ టైంలో పనికొస్తాయని వాటిని అలా ఉంచుతుంటారు. ఈ ఉద్దేశం మంచిదే. కానీ వాటిని ఆ విధంగా ఉంచడం వల్ల కొంత నెగెటివ్ రిజల్ట్ కూడా వస్తుంది. స్మార్ట్‌ఫోన్(Phones Vs Wallets) నిత్యం వేడెక్కుతుంటుంది. దాని వెనుక వైపు నుంచి చాలా వేడి రిలీజ్ అవుతుంటుంది. ప్రత్యేకించి ఓటీటీ యాప్‌లు, గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ హీట్ అవుతుంది. ఈ వేడి అనేది స్మార్ట్ ఫోనులోని ప్రాసెసర్ నుంచి బయటికి వస్తుంటుంది. అదే టైంలో ఫోన్ వెనుక క్యాష్, కార్డులు ఉంటే.. డేంజర్. ప్రాసెసర్ హీట్, కార్డుల ఎఫెక్టు కలగలిసి పేలుడు సంభవించే ముప్పు కూడా ఉంటుంది. కొన్ని సార్లు ఫోన్ పేలకపోయినా, దాని లైఫ్ టైం తగ్గుతుంది.
Also Read :Air Force : భారీగా శాలరీస్.. ఎయిర్ ఫోర్స్‌లో, బీఎస్ఎఫ్‌లో జాబ్స్
- చాలా స్మార్ట్‌ఫోన్లలో యాంటెన్నాలు ఎగువ భాగంలో ఉంటాయి. ఫోన్ల బ్యాక్ కవర్ ఎగువ భాగంలో నగదు, కార్డులను ఉంచితే .. డివైజ్‌లో సిగ్నల్‌లను స్వీకరించే యాంటెన్నాకు ఆటంకం ఏర్పడొచ్చు.
- డెబిట్/క్రెడిట్ కార్డులలో సెన్సార్‌లు, చిప్‌లు ఉండే అవకాశం ఉంది. ఇవి కూడా స్మార్ట్ ఫోనుకు అందే సిగ్నల్స్‌ను ఆపే రిస్క్ ఉంది. ఫలితంగా ఫోనులో నెట్‌వర్క్ సమస్యలు రావచ్చు.
- ఫోన్ బాగా వేడెక్కుతున్నట్లుగా మనకు అనిపిస్తే .. దాని కవర్‌ను కొంత సేపు తీసేయాలి. ఫలితంగా ఫోన్ కొంత కూల్ అవుతుంది.
- ఫోన్ బాగా హీట్ అయినప్పుడు కాసేపు ఇంటర్నెట్ యూసేజ్ ఆపేయాలి. మొబైల్ డాటా ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.
- ఫోన్ వేడిగా ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసి.. 10 నిమిషాలయ్యాక స్విచ్ ఆన్ చేయాలి. ఇలాంటి టిప్స్ ఫాలో అయితే ఫోన్ జీవితకాలం పెరిగే ఛాన్స్ ఉంటుంది.
- స్మార్ట్‌ఫోనుతో పాటే కార్డులను ఉంచుకునేందుకు మార్కెట్లో ప్రత్యేకమైన కార్డ్ హోల్డర్ లభిస్తుంది. దాన్ని ఫిక్స్ చేసుకుంటే కొంత బెటర్. అయితే దీన్ని వాడటం వల్ల ఫోన్ మరింత బరువెక్కుతుంది. దాని మెయింటెనెన్స్ కష్టతరంగా మారుతుంది.