Gifts : అలాంటి వస్తువులు బహుమతిగా ఇస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

మామూలుగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, గృహప్రవేశం కార్యక్రమాలకు ఇలాగా సందర్భాలను బట్టి మనం బహుమతులను (Gifts) ఇస్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 06:20 PM IST

మామూలుగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, గృహప్రవేశం కార్యక్రమాలకు ఇలాగా సందర్భాలను బట్టి మనం బహుమతులను (Gifts) ఇస్తూ ఉంటాం. అయితే కొందరు ప్రియమైన వారికి ఎప్పటికీ గుర్తిండి పోవాలని కొంచెం మంచిగా గిఫ్ట్ అందిస్తూ ఉంటారు. అలా బహుమతులు ఇవ్వడం మంచిదే కానీ తెలిసి తెలియకుండా కొన్ని రకాల బహుమతులను (Gifts) అస్సలు ఇవ్వకూడదట. మరి ముఖ్యంగా వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా అలాంటి బహుమతులను (Gifts) ఇవ్వడం అన్నది దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అంటున్నారు వాస్తు శాస్త్రాన్ని నిపుణులు. మరి ఎటువంటి బహుమతులను ఇవ్వకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఎప్పుడూ కూడా ఎదుటివారికి బహుమతులు ఇచ్చేటప్పుడు పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం అన్నది బహుమతులు ఇచ్చే వారితో పాటు తీసుకున్న వారికి కూడా హానికరం. కత్తులు, కత్తెరలు, ఇతర ప‌దునైన‌ వస్తువులు దురదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఎవరికైనా ఏదైనా పదునైన వ‌స్తువుల‌ను బహుమతిగా ఇవ్వడం వలన విపరీతమైన వ్యతిరేక, ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుందట. అలాగే ఎప్పుడూ కూడా ఇతరులకు గడియారాలను బహుమతులుగా ఇవ్వకూడదు. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయుర్దాయం ప్రతికూలంగా తగ్గుతుంది. అదే విధంగా గడువు తేదీలు దాటిన బహుమతులను ఇవ్వడం ఎప్పటికీ మంచిది కాదు.

ఎందుకంటే అలా చేయడం వలన ఇచ్చే వ్యక్తికి, గ్రహీతకు మధ్య స్నేహం ప్రమాదంలో పడవచ్చు. అలాగే గడియారం ఇచ్చిన సమయంలో మన పరిస్థితిలో బాగోలేకపోతే వారికి కూడా అలాంటి పరిస్థితులే మొదలవుతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా పర్సులు, డబ్బు సంచులను బహుమతిగా ఇవ్వవద్దు. ఎందుకంటే అవి డబ్బును కలిగి ఉంటాయి. వీటిని మరొకరికి ఇవ్వడం ద్వారా, మీ సానుకూల ఆర్థిక శక్తిని బ‌య‌ట‌కి పంపుతున్నారు. అందువ‌ల్ల మీ వ‌ద్ద ధ‌నం నిల‌బ‌డ‌దు. కాబట్టి ఇలా ఎప్పుడు చేయకండి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చాలామంది గృహప్రవేశం కార్యక్రమం సమయంలో ఎక్కువగా అక్వేరియంలు, వీటితో నిండిన ఆకర్షణీయమైన వస్తువులు ఇస్తూ ఉంటారు.

కానీ అలాంటి వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా, మీరు మీ కర్మ, శ్రేయస్సును వారికి అందజేస్తున్న‌ట్లు భావించాలి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం, పని కోసం ఉపయోగించే స్టేషనరీ వంటి వస్తువులను ఇవ్వడం కూడా స‌రైన‌ది కాదు. ఇలా చేయ‌డం శ్రేయస్సును వ్యాప్తి చేయకపోగా, మీరు బ‌హుమ‌తి ఇచ్చిన వారి వృత్తి జీవితంలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు. రచయిత లేదా సృజనాత్మక వృత్తిలో ఉన్నవారికి పెన్నులు, పుస్తకాలు త‌దిత‌ర‌ బహుమతులను ఎప్పుడూ అందించకూడదు.

Also Read:  What’s App Income : వాట్సాప్ గురించి ఈ లెక్కలు తెలిస్తే.. షాకవ్వడం ఖాయం