Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్లలో.. పురుగులు, చీమలకు చెక్

Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్ల పెట్టెల చుట్టూ.. చీమలు, పురుగులు నిత్యం చక్కర్లు కొడుతుండటాన్ని మనం చూస్తుంటాం.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:34 PM IST

Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్ల పెట్టెల చుట్టూ.. చీమలు, పురుగులు నిత్యం చక్కర్లు కొడుతుండటాన్ని మనం చూస్తుంటాం. వాటిని ఎలా పారదోలాలి ? ఏం చేయాలి ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

  • పప్పులు, బియ్యం వంటి గింజల్లో బేకింగ్ సోడాను కలిపితే చీమలు, ఇతర కీటకాలు వాటి దరికి చేరవు.  ఒకవేళ ఇలా చేస్తే.. వాటిని వాడే ముందు తప్పకుండా నీటితో కడగాలి.
  • కాటన్‌ను వెనిగర్‌లో ముంచి వంటగదిలో అక్కడొకటి అక్కడొకటి పడేస్తే.. వాటి నుంచి రిలీజయ్యే ఘాటు వాసనకు చీమలు, కీటకాలు ఆ వైపు రావడానికి జంకుతాయి.
  • పప్పులు, బియ్యం, నట్స్‌కు చీమలు, పురుగులు పట్టకూడదంటే.. వాటిలో బిర్యానీ ఆకులు వేయండి. ఆ ఆకుల ఘాటు వాసనకు చీమలు, పురుగులు దరిచేరవు.
  • తేనె‌కు చీమలు పట్టకూడదంటే.. అందులో లవంగాలు వేయొచ్చు. ఇక తేనె డబ్బా మూత చుట్టూ వాసెలిన్ రాయాలి. దీనివల్ల మూత భాగంలోకి చీమలు చేరవు.
  • బియ్యం పిండి, గోధుమ పిండికి పురుగులు పట్టొద్దంటే.. వాటిలో మిరియాలు, దాల్చిన చెక్క వేయాలి.
  • పంచదారకు చీమలు పట్టడం సహజం. చక్కెర ఉంచిన డబ్బాలో దాల్చిన చెక్క వేస్తే చీమలు, పురుగులు దానిలోకి(Kitchen Tips) ప్రవేశించవు.

Also Read: Kaun Banega Crorepati 15 : కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం లో పుష్ప కు సంబదించిన ప్రశ్న