Site icon HashtagU Telugu

Skin Health Tips : మీ స్కిన్ మెరిసిపోవాలంటే ఇలా చేయండి..

Skin

Healthy Skin Tips

స్కిన్ (Skin) అందంగా కనిపించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. అందుకోసం మనం కొన్ని టిప్స్ (Tips) పాటించడం వల్ల చాలా వరకూ స్కిన్ అందంగా మెరుస్తుంది. ఇవన్నీ కూడా పాటించడం వల్ల మెరుగైన స్కిన్ (Healthy Skin) మీ సొంతం అవుతుంది. దీని కోసం కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడకుండానే అందంగా కనిపించొచ్చు. మరి 2023 లో అందరికీ స్కిన్ టైప్‌కి (Skin Tips) సరిపోయే స్కిన్ కేర్ టిప్స్ గురించి తెలుసుకుందాం..

నెరోలీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది స్కిన్‌ని మెరిపిస్తుంది. ఇది డ్రై స్కిన్‌కి చాలా మేలు చేస్తుంది. దీనిని ఫేషియల్ ఆయిల్‌లా మేలు చేస్తుంది. రెండు చుక్కల ఈ ఆయిల్‌ని ఆల్మండ్ ఆయిల్‌లో కలిపి బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో టవల్‌ని ముంచి ముఖంపై పెట్టుకుని అలా ఉండండి. దీంతో స్కిన్ రిలాక్స్ అవుతుంది.

ఇలా చేయండి:

ముఖంపై వేడి నీరు వేసి కడగడం వల్ల మీ స్కిన్‌పై ఉన్న నేచురల్ ఆయిల్స్‌ని దూరం చేసి డ్రైగా మారుతుంది. వేడి నీరు కంటే గోరువెచ్చని నీరు వాడడం చాలా ముఖ్యం. అదే విధంగా స్ట్రాంగ్‌గా ఉన్న సోప్స్, క్లెన్సర్స్‌ని వాడొద్దు. వీటిని వాడడం వల్ల చర్మంలోని మాయిశ్చర్‌ని దూరం చేస్తుంది. స్నానం, ముఖం కడిగిన తర్వాత టవల్‌తో మీ ముఖాన్ని మెల్లిగా అద్దండి. ఈ టవల్స్‌ని ఎండలో ఆరబెట్టండి.

హెల్దీ డైట్:

మంచి హెల్దీ డైట్ ఆరోగ్యానికే కాదు.. అందంగా కనిపించేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తినడం మంచిది. అదే విధంగా ఫిష్ ఆయిల్, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం, అన్ హెల్దీ ఫ్యాట్‌, ప్రాసెస్డ్, రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అదే విధంగా నీరు ఎక్కువగా తాగడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా ఉండేలా కనిపిస్తాయి.

స్ట్రెస్ అండ్ స్లీప్:

అదే విధంగా ఒత్తిడి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్‌కి కారణం అవుతుంది. అందుకే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మైండ్‌ని రిలాక్స్ చేసుకోవాలి. అదే విధంగా మంచి నిద్ర కూడా స్కిన్ రీజెన్యూయేట్ అయ్యేలా చేస్తుంది. నిద్రలో స్కిన్ తనని తాను రిపేర్ చేసుకుంటుంది.

సిటిఎం:

స్కిన్‌ అందంగా కనిపించేలా చేసేందుకు స్కిన్ కేర్ రొటీన్ మెంటెయిన్ చేయాలి. దీని వల్ల స్కిన్ హెల్తీగా కనిపిస్తుంది. సీటీఎమ్ అంటే.. సీ అంటే క్లెన్సింగ్.. మంచి క్లెన్సర్‌తో ముఖాన్ని కడిగి.. మంచి టోనర్ వాడాలి. దీని వల్ల స్కిన్ హైడ్రేట్‌గా అనిపిస్తుంది. దీని వల్ల ఇంప్యూరిటీస్‌ని దూరం చేస్తుంది. ఆ తర్వాత ఎమ్ అంటే మాయిశ్చరైజింగ్ అప్లై చేయాలి. దీంతో స్కిన్ సాఫ్ట్‌గా కనిపించేలా చేస్తుంది.

డార్క్ సర్కిల్స్:

అదే విధంగా ఐకేర్ కూడా ముఖ్యమే. అందుకోసం ఐ క్రీమ్ రాయడం లేదా, జెల్ రాయడం వల్ల డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి. అదే విధంగా పొటాటో స్లైస్ పెట్టడం వల్ల డార్క్ సర్కిల్స్‌ని దూరం చేస్తాయి.

బనానా ఫేస్ ప్యాక్:

బనానా ఫేస్ ప్యాక్ అనేది మాయిశ్చరైజింగ్‌లా పని చేస్తుంది. ఇందుకోసం అరటిపండు తీసుకుని 1 టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా పాలపొడి , 2 చుక్కల శాండిల్ వుడ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.

ఫౌండేషన్:

అదే విధంగా ఫౌండేషన్ వాడే పద్ధతిలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బేస్డ్, లైట్ వెయిట్ ఫౌండేషన్ వాడాలి. దీని వల్ల స్కిన్ మాయిశ్చరైజింగ్ లుక్ వస్తుంది.

నీరు తీసుకోవడం:

చలికాలంలో నీరు తాగాలని అనిపించదు. కానీ, రోజూ 8 గ్లాసుల నీరు తాగడం ముఖ్యం. దీని వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండి శరీరంలోని టాక్సిన్స్ దూరమవుతాయి.

పసుపు:

పసుపు కూడా కొత్త స్కిన్ సెల్స్ పెరిగేలా చేస్తుంది. ిది స్కిన్ సెల్స్‌ని పాడవ్వకుండా చూస్తుంది. పసుపు, బియ్యం పిండిని కలిపి పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే చర్మంపై ఉన్న ముడతలు తగ్గిపోతాయి.

జాస్మిన్ ఆయిల్:

ఈ జాస్మిన్ ఆయిల్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. జాస్మిన్ ఆయిల్‌ని బాదం నూనెతో కలిపి ముఖంపై మసాజ్ చేయాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ని ముఖంపై వేసి రిలాక్స్ అవ్వాలి. ఇది మీ చర్మంలో ఎలాస్టిసిటీని పెంచుతుంది.

రోజ్ టోనర్:

ఓ స్ప్రే బాటిల్‌లో నీరు తీసుకుని అందులో 4 చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి స్ప్రే చేసుకోండి. ఇది రోజంతా అవసరమయ్యే ఫ్రెష్‌ని ఇస్తుంది.

మొటిమలు దూరం:

మొటిమలు దూరమయ్యేందుకు టీట్రీ ఆయిల్ హెల్ప్ చేస్తుంది. కొద్దిగా ఆయిల్ తీసుకుని డైరెక్ట్‌గా పింపుల్స్‌పై అప్లై చేయండి. సమస్య తగ్గుతుంది.

ట్యాన్ రిమూవ్ కోసం:

ముందుగా పెరుగు తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, శాండిల్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఓ ఆలుగడ్డని ముక్కని తీసుకుని దానిపై ముందుగా తయారైన క్రీమ్‌ని పెట్టి ముఖంపై రుద్దాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత కడగాలి.

టమాటా ప్యూరీ:

టమాట ప్యూరీ అనేది చర్మంపై ట్యాన్‌ని దూరం చేస్తుంది. దీనిని అప్లై చేయడం వల్ల ట్యాన్ దూరమైన స్కిన్ టోన్ మెరుగ్గా మారడమే కాకుండా స్కిన్ గ్లోయింగ్‌గా కనపడుతుంది.

కుకుంబర్ ఫేస్ ప్యాక్:

రాత్రికి రాత్రే మీ స్కిన్ మెరిసిపోవాలనుకుంటే దోసకాయలతో ఫేస్ ప్యాక్ చేసుకోండి. ఇందులో రోజ్ వాటర్, గ్లిజరిన్ మిక్స్ చేయొచ్చు.

కాఫీ:

స్కిన్ డెడ్ సెల్స్‌ని దూరం చేయడంలో కాఫీ బీన్ స్క్రబ్ బాగా పనిచేస్తుంది. కాఫీతో స్కిన్ మెరుగ్గా కనిపిస్తుంది.

మాయిశ్చరైజర్ ముఖ్యం:

ఏ సీజన్ అయినా స్కిన్‌కి మాయిశ్చరైజర్ అవసరం. దీని వల్ల పోర్స్ తగ్గుతాయి. జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ స్కిన్‌కి అవసరం.

Also Read:  Health Tips: అన్నానికి బదులుగా ఆ ఆహార పదార్థాలు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?