Site icon HashtagU Telugu

Sleep Tips : రాత్రిళ్లు హాయిగా నిద్రపోవలంటే ఇలా చేయండి..

Sleep Stress

Sleep Stress

మనలో చాలా మందికి రాత్రిళ్లు (Night) సరిగా నిద్రపోరు. నిద్ర (Sleep) పట్టక సెల్‌ ఫోన్లు (Cell Phone), టీవీలు (TV), ల్యాప్‌ టాప్‌ (Laptop) లతో టైమ్ పాస్ (Time Pass) చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

కరోనా (Corona) జీవితాలను మార్చేసింది. బిజీ లైఫ్ (Busy Life)​ కారణంగా ఒత్తిడి (Stress) అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర (Sleep) కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్​ ఎక్కినా తొందరగా నిద్రరాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు , కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు  ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం..

రాత్రి భోజ‌నాని (Dinner) కి ముందు మద్యం సేవించడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే, స్వ‌చ్చ‌మైన నిద్ర‌ కావాలంటే రాత్రి పూట మద్యానికి దూరంగా ఉండాల్సిందే. చాలామంది రాత్రి పూట‌ వ్యాయామం చేస్తే అలసిపోతే బాగా నిద్రపడుతుందని అనుకుంటారు.  ఎక్సర్‌ సైజ్ (Exercise) చేయడం వల్ల శ‌రీరంలోని నరాల‌న్నీ ఉత్తేజం అవుతాయి. అప్పుడు నిద్ర కోసం చాలా స‌మ‌యం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది. కెఫెన్ (Caffeine) ఉండే ప‌దార్థాల‌కు రాత్రిపూట‌ సాధ్య‌మైనంత దూరంగా ఉండండి. చాలా మంది కాఫీల‌కు చాలా అల‌వాటు ప‌డి ఉంటారు. అది మోతాదుకు మించితే నిద్ర‌కు ప్ర‌మాద‌మే. మద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానికరం. అలాగే మీ ప్ర‌శాంతమైన నిద్ర‌కు కూడా ప్ర‌మాద‌క‌రం.

అతిగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌ను ఎక్కువగా తీసుకోకపోవడం బెటర్​. అవి సరిగ్గా జీర్ణం అవ్వ‌క మీ నిద్ర‌కు భంగం క‌లిగిస్తాయి. కొవ్వులు లేని ఆహారం పదార్థాలు గానీ, మంచి విటమిన్లతో కూడిన ఆహారం తీసుకుంటే బెటర్​. మొబైల్​ మీద ఉండే బ్లూ లైట్ అనేది కళ్లకు చాలా హాని చేస్తోంది. ముఖ్యంగా చీకట్లో దీన్ని వినియోగించ‌డం వ‌ల్ల క‌ళ్ల‌పై ఎఫెక్ట్ చూపించి నిద్ర‌ను దూరం చేస్తోంది.

Also Read:  Sleep Health Hazard: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..