Kitchen Tips : పచ్చి మిరపకాయలను ఎక్కువరోజులు నిల్వ చేసే చిట్కాలివీ

Kitchen Tips : చాలామంది కూరగాయల మార్కెట్‌కు వెళ్లినప్పుడు రెండువారాలకు సరిపడా పచ్చిమిరపకాయలను కొనుగోలు చేస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Green Chillies

Green Chillies

Kitchen Tips : చాలామంది కూరగాయల మార్కెట్‌కు వెళ్లినప్పుడు రెండువారాలకు సరిపడా పచ్చిమిరపకాయలను కొనుగోలు చేస్తుంటారు. అయితే వాటిని ఇంటికి తెచ్చి.. సరిగ్గా నిల్వ చేయరు. దీంతో తెచ్చిన పచ్చిమిర్చిలో చాలామేరకు కుళ్లిపోతుంటాయి. ఎర్రబారి పోతుంటాయి. మిర్చి తాజాదనాన్ని త్వరగా కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది.  కొన్ని టిప్స్ ఫాలో అయితే పచ్చిమిర్చిని ఫ్రెష్‌గా ఉంచొచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

రెండువారాలు.. నెల.. ఏడాది

  • ముడతలు, మచ్చలు లేని పచ్చిమిర్చిని కొనాలి.
  • ఇంటికి తెచ్చి వాటిని నీళ్లతో కడగాలి.  పచ్చిమిర్చిని స్టోర్ చేసేటప్పుడు తడిగా ఉండకూడదు. తడిగా ఉన్న మిరపకాయలు త్వరగా కుళ్లిపోతాయి.
  • కడిగిన మిరపకాయలను పేపర్ టవల్ మీద కాసేపు ఉంచాలి. అనంతర వాటిని పేపర్ టిష్యూలో చుట్టి,  ఫ్రిజ్‌లోని జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయాలి. మిరపకాయలు వేసిన పేపర్ టిష్యూను కాగితంతో కప్పి ఎయిర్ టైట్ బాక్స్‌లో కూడా స్టోర్ చేయొచ్చు. ఈ విధంగా మిరపకాయలను దాదాపు రెండువారాలు స్టోర్ చేయొచ్చు.
  • మిరపకాయలు ఎండిపోయినప్పుడు, వాటి కాడలను తీసివేయండి. పాడైపోతున్న మిరపకాయలను తీసి పక్కన పెట్టాలి.
  • ఒకవేళ పచ్చిమిర్చిని నెలపాటు నిల్వచేయాలంటే.. వాటిని కడిగి, ఆరబెట్టాక తొడిమలు తీయాలి. గాలి చొరబడని డబ్బాలో  పేపర్ టవల్ వేసి.. దానిపై మిర్చి వేయాలి.  మిర్చిపై మరో పేపర్ టవల్ వేయాలి. ఆ డబ్బాను మూతపెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే నెలపాటు పాడుకాదు.
  • పచ్చిమిర్చి ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే.. టీస్పూన్ వెనిగర్ నీళ్లలో వేయండి. ఈ నీటిలో మిర్చిని వేసి కాసేపు ఉంచండి. అనంతరం నీళ్లతో శుభ్రం చేసి..పేపర్ టవల్ పై ఆరబెట్టండి. మిర్చితొడిమలు తీసేసి, జిప్ లాక్ బ్యాగ్, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి.
  • ఆవాలు లేదా కూరగాయల నూనెను వేడి చేసి, చల్లార్చండి. చల్లార్చిన నూనెలో పచ్చిమిరపకాయలను వేసి నానబెట్టాలి.  ఈ మిరపకాయలను ఒక బాక్స్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో పెడితే చాలారోజులు నిల్వ (Kitchen Tips)  ఉంటాయి.
  Last Updated: 30 Oct 2023, 10:28 AM IST