Site icon HashtagU Telugu

Dreams : తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు నిజంగా నిజం అవుతాయా.. పండితులు ఏం చదువుతున్నారంటే?

Do Dreams That Come In The Early Hours Of The Morning Really Come True.. What Are The Scholars Reading..

Do Dreams That Come In The Early Hours Of The Morning Really Come True.. What Are The Scholars Reading..

Early Morning Dreams : మామూలుగా నిద్రలో మనకు కలలు రావడం అన్నది సహజం. మంచి కలలు, పీడకలలు చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు (Dreams) నిజమవుతాయని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. మరి నిజంగానే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా నిద్రను మనం నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగంలో వచ్చిన కలలు (Dreams) ఏడాది తర్వాత చెడు ఫలితాలనిస్తాయి. ఇక రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12 నెలల్లో ఫలితాన్నిస్తాయి. మూడవ భాగంలో వచ్చిన కలలు 3-6 నెలల్లో ఫలితాన్నిస్తాయి. నాల్గవ భాగంలో వచ్చిన కలలు 1-3 నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి.

We’re Now on WhatsApp. Click to Join.

ఏదైనా కల సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్టైతే దాని ఫలితాన్ని సుమారు 10-15 రోజుల్లో ఉంటుందని అర్థం. అనగా తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు (Dreams) నిజమవుతాయన్నమాట. అలా వచ్చిన కలలు నెలలోపే ఫలితాలను ఇస్తాయి. కలలు రెండు రకాలుగా అవి ఒకటి మంచి కలలు రెండు చెడ్డ కలలు. ముందుగా చెడు కలల విషయానికి వస్తే.. కలలో నెత్తి మీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం, ఒంటిపై ఉన్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పై నుంచి కింద పడటం లాంటివి కలలో కనిపించడం అసలు మంచిది కాదు. పాములను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించడం శుభప్రదం కాదు.

పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం మంచిది కాదని చెబుతారు. మంచి కలల విషయానికి వస్తే.. కలలో చేప‌లు క‌నిపిస్తే ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతుంది. దెబ్బలు తింటున్న‌ట్లు క‌నిపిస్తే మీరు ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు అవుతార‌ు. కాళ్లు, చేతులు క‌డుగుతున్న‌ట్లు క‌ల‌ వస్తే అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. పాము క‌నిపిస్తే మీకు భ‌విష్య‌త్తులో అనుకున్న‌వి నెర‌వేరుతాయి. పెద్ద‌లు దీవిస్తున్న‌ట్లు, పాలు, నీళ్లు తాగుతున్నట్టు క‌నిపిస్తే మీకు స‌మాజంలో గౌర‌వ ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. క‌ల‌లో కుక్క మిమ్మ‌ల్ని క‌రిచిన‌ట్లు క‌నిపిస్తే త్వ‌ర‌లో క‌ష్టాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ట‌. పెళ్లి అయిన‌ట్లు క‌ల‌వ‌స్తే మీకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. క‌ల‌లో అద్దం క‌నిపిస్తే మానసిక ఆందోళ‌నకు గుర‌వుతార‌ని అర్థం. రైలు ఎక్కుతున్న‌ట్లు క‌ల వ‌స్తే యాత్ర చేస్తార‌ని భావించాలి. కాలుజారి ప‌డిన‌ట్లు క‌ల వ‌స్తే మీకు అష్ట‌క‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ట. క‌ల‌లో ఆవు దొరికిన‌ట్లు వ‌స్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కిన‌ట్లు క‌ల వ‌స్తే మీకు ప‌దోన్న‌తి క‌లుగుతుంది. మీరు చ‌నిపోయిన‌ట్లు మీకు క‌ల వ‌స్తే మీకున్న స‌మ‌స్య‌లు పోతాయ‌ని అర్థం.

Also Read:  Soya Matar Curry: ఘమఘమలాడే సోయా మటర్ కర్రీ.. ఇంట్లోనే ట్రై చేయండిలా?