Wayanad : వాయనాడ్ యొక్క రహస్య సౌందర్యాన్ని కనుగొనడం: కేరళ యొక్క సహజమైన అడవి

'మయక్షేత్ర' అనగా మయుల యొక్క ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఆ తరువాత 'మయక్షేత్ర' మయనాడ్ గా ఆ తరువాత 'వాయనాడ్' (Wayanad) గా మారిపోయింది.

Enigmatic Beauty of Wayanad : కేరళలో ఉన్న పన్నెండు జిల్లాలలో ఒకటయిన వాయినాడు, కన్నూరు మరియు కోజ్హికోడ్ జిల్లాల మధ్య ఉంది. ఈ ప్రాంతం లో ఉన్న ఎన్నో ప్రత్యేకతల వలన ఇది ఎంతో ప్రసిద్దమైన పర్యాటకుల మజిలీ అయింది. వెస్ట్రన్ ఘాట్స్ పర్వతాల మధ్య ఉన్న పచ్చని చెట్ల మధ్య నెలకొని ఉన్న ఈ ప్రాంతం, సహజసిద్దమయిన అందం తో ప్రాచుర్యం పొందింది. కళ్ళని తిరిగి ఉత్తేజ పరిచేంత అందం ఈ ప్రాంతం సొంతం. ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు విచ్చేస్తున్నారనడంలో ఆశ్చర్యం లేదు. వారి దైనందిన రొటీన్ జీవన విధానం నుండి కొంచెం విరామం పొందడానికి కార్పొరేట్ జన సందోహంఇక్కడికి వస్తుంటారు. రోజు వారి జీవితాలలో మనం కోల్పోతున్న ప్రశాంతత , సంతృప్తి లను ఇక్కడ పొందేందుకు అనువైన ప్రదేశం. ఆరంభం కేరళ యొక్క పన్నెండవ జిల్లాగా ఏర్పాటైన వాయనాడు కి నవంబర్ 1, 1980 లో భారతదేశ పటం లో చోటు దక్కింది. ఇంతకు పూర్వం, ‘మయక్షేత్ర’ అనగా మయుల యొక్క ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఆ తరువాత ‘మయక్షేత్ర’ మయనాడ్ గా ఆ తరువాత ‘వాయనాడ్’ (Wayanad) గా మారిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

స్థానిక మహా పురుషుల ప్రకారం ‘వాయనాడ్’ (Wayanad) అనే పేరు ‘వాయల్’ మరియు ‘నాడ్’ అనే పదాల నుండి పుట్టింది. ఈ రెండు పదాలను కలిపితే ‘వరి పొలాల నెల’ అని అర్ధం. గొప్పదైన వెస్ట్రన్ ఘాట్స్ పై ఉన్న ఈ ప్రాంతం వర్షాకాలం లో సందర్శకులకి సంభ్రమాశ్చర్యానుభుతులని కలిగిస్తుంది. దుమ్మూ, ధూళి నుండి ఆకులని వర్షాలు శుభ్రం చేయడంతో ఆ ప్రాంతం మొత్తం కడిగిన ముత్యంల్లా స్వచ్చంగా తయారవుతుంది. మెరుస్తున్న పెద్ద మరకతాన్ని ఈ ప్రాంతం తలపిస్తుంది. ఒక అద్భుతమైన కధని ఈ ప్రాంతం మొత్తానికి అల్లేయవచ్చు. మూడు వేల సంవత్సరాల ముందు కూడా వాయనాడు అనే ప్రాంతం ఉన్నదని పురావస్తు పరిశోధనా ఆధారాలు తెలుపుతున్నాయి. మానవులు, వన్యప్రాణులు శాంతియుతంగా సామరస్యంతో గడుపుతున్న జీవనాన్ని ఈ అడవిలో గమనించవచ్చు. క్రీస్తు పుట్టుకకి పది శతాబ్దాల క్రితం కూడా ఈ ప్రాంతం యొక్క ఉనికి ఉన్నదని చెక్కబడిన కొన్ని నగిషీలు మరియు శిల్పాల వంటి ఆధారాల ద్వారా తెలుస్తోంది.

శతాబ్దాల పాటు వాయనాడు, గొప్ప సాంస్కృతిక చరిత్రని గడించింది. పద్దెనిమిదవ శతాబ్దంలో హైదర్ అలీ దండయాత్రకి సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలుస్తుంది. ఆ తరువాత, కొట్టాయం రాజ వంశీకుల చేత ఈ ప్రాంతం పరిపాలించబడినది. కొన్నాళ్ళ తరువాత, బ్రిటిష్ వారిచే ఈ ప్రాంతం వందేళ్ళ కు పైగా పాలించబడినది. ఈ ప్రాంతంలో ఉన్న టీ మరియు కాఫీ ప్లాంటేషన్స్ బ్రిటిష్ వారి అధ్వర్యంలో నే ప్రారంభించడమైనది. సులభంగా ఈ ప్రదేశానికి చేరుకునేందుకు బ్రిటిష్ వారు వాయనాడ్ (Wayanad) చుట్టూ పక్కల ప్రాంతాలలో రోడ్డు సౌకర్యాలని కల్పించారు.

Also Read:  Beetroot Benefits: బీట్​రూట్​ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు..!

ఈ సౌకర్యం ద్వారా ఎంతో మంది వలసదారులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. మెరుగైన మరియు నూతనమైన అవకాశాల కోసం ఇక్కడికి వచ్చిన ఎంతో మందికి వారి కల నిజం చేసిన ప్రాంతంగా ప్రసిద్ది పొందింది. వాయనాడ్ లో ని రహస్య నిధులు వాయనాడ్ లో ఉన్న అందమైన పచ్చటి కొండల మధ్య మన దేశం యొక్క కొన్ని పురాతన తెగవాసులు నివసిస్తున్నారు. ఈ తెగల ప్రజలకి జన సందోహంలో కలిసే ఆసక్తి లేదు. సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వారి వారి జీవన విధానంలోనే గడపడం వారు కోరుకుంటున్నారు. ఇందులో వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఒక్కసారి ఈ వాయనాడు యొక్క అద్భుతమైన పచ్చదన సౌందర్యాన్ని చుసిన వారెవరికైనా ఈ ప్రదేశం విడిచి వెళ్లాలని అనిపించదు. వాయనాడు కి దగ్గరలోని ఉన్న కొన్ని గుహలలో లభించిన కొన్ని చారిత్రాత్మక చెక్కడాలు లభించినప్పటి నుండి ఈ ప్రాంతం పురావస్తు పరిశోధనల కేంద్రంగా ప్రాంతం ప్రజలను ఆసక్తిపరుస్తోంది.

మధ్య రాతి యుగముల కాలంలో వాయనాడు వైభవానికి ప్రతీకగా ఇక్కడ దొరికిన కొన్ని నగిషీలు చెబుతున్నాయి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ అందమైన పచ్చటి కొండలు, ఆకుపచ్చని సౌందర్యం, సుగంధభరిత తోటలు, దట్టమైన అడవులు మరియు సంపన్న మైన సాంస్కృతిక చరిత్ర ఇక్కడ ఉండే ప్రధాన ఆకర్షణలు. విశాలమైన హృదయంతో వాయనాడ్ ఆధునీకతకు కూడా స్వాగతం పలికింది. అడవులకి దగ్గరలో ఉన్న కొన్ని రిసార్ట్స్ ల లో అలసి సొలసిన పర్యాటకులని తిరిగి ఉత్తేజ పరిచేందుకు ఆయుర్వేదిక్ మసాజ్, స్పా వంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాయనాడు నవీనత మరియు సాంప్రదాయాల సంగమం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. వాయనాడు సందర్శనం జీవితకాలపు అనుభూతిని కలిగిస్తుంది. వాయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురి వాయనాడు పీఠభూమి పైన ఉన్న ఈ వాయనాడు వైల్డ్ లైఫ్ సాంచురి కేరళ లో నే ప్రధానమైన పర్యాటక ఆకర్షణ.

ఇది దక్షిణ భారతదేశం లో నే ప్రసిద్దమైన సాంచురి. అంతేకాదు, కేరళ లో ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురి ల లో రెండవ స్థానాన్ని పొందింది. ఈ సాంచురి లో ఉండే వన్య మృగాలని సందర్శించడానికి ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. జింక, ఏనుగు, అడవి దున్న మరియు పులి వంటి జంతువులు, నెమలి, పీ ఫోల్స్ వంటి అడవి అరణ్య పక్షులని ఈ సాంచురి లో గమనించవచ్చు. పచ్చదనం తో కనువిందు చేసే ప్రశాంత వాతావరణంలో ఈ సాంచురి ఉంది. ఇక్కడున్న అందమైన మరియు ప్రశాంత వాతావరణం కి పర్యాటకులు అమితంగా ఆకర్షితమవుతారు.

టేకు కలపని అందించే చెట్లు ఎన్నో ఇక్కడ పుష్కలంగా కనిపిస్తాయి. పిల్లలతో ప్రయానించే పర్యాటకులకి తప్పని సరిగా చూడవలసిన ప్రదేశంగా ఈ వైల్డ్ లైఫ్ సాంచురి ని చెప్పుకోవచ్చు. ప్రపంచపు వారసత్వపు చిహ్నంగా ఈ ప్రాంతం యునెస్కో హెరిటేజ్ కమిటీ చేత గుర్తింపబడింది.

Also Read:  Layoff 2023: రోల్స్ రాయిస్, లింక్డ్ఇన్ కంపెనీల్లో ఉద్యోగులు తొలగింపు.. కారణమిదే..?