Site icon HashtagU Telugu

Dilwara Jain Temples : దిల్వార జైన దేవాలయాలు, మౌంట్ అబూ

Dilwara Jain Temples, Mount Abu

Dilwara Jain Temples, Mount Abu

Dilwara Jain Temples, Mount Abu : 11 వ శతాబ్దం, 13 వ శతాబ్దం లో నిర్మించిన దిల్వార జైన దేవాలయాలు (Dilwara Jain Temples) తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ దేవాలయాలు తెల్లటి పాలరాయితో అందంగా చెక్కారు. ఈ దేవాలయాలలో అధ్భుతంగా చెక్కిన ఐదు జైన దేవాలయాలు వున్నాయి, ఇవి మొత్తం రాజస్థాన్ లోని అత్యంత అందమైన దేవాలయాలుగా పేరు పొందాయి. రాజస్థాన్ లోని ఐదు గ్రామాల పేరిట ఏర్పడ్డ ఈ దేవాలయాలు ఒక దాని నుండి మరొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

విమల్ వసహి దేవాలయం, లున వసహి దేవాలయం, పీతాల్ హర్ దేవాలయం, ఖర్తర్ వసహి దేవాలయం, శ్రీ మహావీర్ స్వామి దేవాలయం అనేవి ఈ ఐదు దేవాలయాలు. తమ తీర్థంకరులను (యోగులు) పూజించడానికి పెద్దసంఖ్యలో జైన భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ దేవాలయాల అధ్భుత నిర్మాణ శైలిని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు.ఈ దేవాలయాల గురించి మరింత తెలుసుకునేందుకు అద్దె చెల్లించి టూరిస్ట్ గైడ్ ల సేవలను పొందవచ్చు. మౌంట్ అబూ నుండి రెండున్నర కి. మీ. దూరంలో గల దిల్వార దేవాలయాలను (Dilwara Jain Temples) రోడ్డు ప్రయాణం ద్వారా చేరవచ్చు.

Also Read:  Mount Abu : మౌంట్ అబూ – అద్భుతాల గుట్ట!!