Site icon HashtagU Telugu

Childs Study Table : ఇంట్లో పిల్లల స్టడీ టేబుల్ ఎలా ఉండాలో తెలుసా ?

UGC Decision

UGC Decision

Childs Study Table : పిల్లలు చదువుకునేందుకు మనం ఇంట్లో స్టడీ రూమ్, స్టడీ టేబుల్ పెడుతుంటాం. చాలామంది స్టడీ టేబుల్ మీద పుస్తకాలతో పాటు ఏవేవో వస్తువులను పెడుతుంటారు. అలా అనవసరమైన  వస్తువులను టేబుల్‌పై పెట్టడం వల్ల పిల్లల చదువు మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు స్టడీ టేబుల్‌‌ను (Childs Study Table)  ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  1. స్టడీ టేబుల్‌‌ చుట్టూ ప్రదేశాలు ప్రశాంతంగా ఉండాలి. పెద్ద సౌండ్లు రాకుండా చూసుకోవాలి.
  2. స్టడీ టేబుల్ మీద ఉంచకూడని మొదటి వస్తువు సెల్ ఫోన్.  సెల్ ఫోన్ ఎదురుగా కనపడితే పిల్లలతో పాటు పెద్దలు కూడా పుస్తకంపై ఫోకస్ పెట్టలేరు. పుస్తకంపై కంటే ఫోన్‌పైకే ఎక్కువ ధ్యాస మరలుతుంది. ఫోనుకు వచ్చే నోటిఫికేషన్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. వాటివైపు మనల్ని లాగుతూనే ఉంటాయి. అందుకే స్టడీ టేబుల్ మీద ఫోన్ లేకుండా చూసుకోవాలి.
  3. స్టడీ టేబుల్‌ను పెన్నులు, పెన్సిల్, స్టేషనరీలతో నింపేయకూడదు. అలా ఎక్కువగా అన్నీ నింపేస్తే.. వాటిలో మనకు కావాల్సింది వెతుక్కోవడానికి, తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే స్టడీ టేబుల్‌పై స్టేషనరీ భాగాలు రెండు, మూడుకు మించి ఉంచకూడదు.
  4. స్టడీ టేబుల్‌పై టెక్ గాడ్జెట్స్, డిజిటల్ గాడ్జెట్స్‌ను ఉంచకూడదు. ఎందుకంటే వాటికి చదువుతో సంబంధం లేదు. వాటిని చూస్తే ఆ గాడ్జెట్లతో టైం స్పెండ్ చేయాలనే ఆలోచనలు వస్తుంటాయి.
  5. స్టడీ టేబుల్‌ను యాక్సెసరీలతో అందంగా డెకరేట్ చేయకూడదు. డెకరేషన్‌లు అందంగా ఉంటాయి. కానీ పిల్లల్ని  స్టడీ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. ఇవి చదివే టైంలో ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకే అలాంటి డెకరేషన్లకు దూరంగా ఉండాలి.
  6. స్టడీ టేబుల్‌ను చిందర వందరగాఉంచకూడదు. దానిపై పేపర్లు, పుస్తకాలు కుప్పకుప్పలుగా ఉంచకూడదు. అలా ఉంచితే చదువుకునేటప్పుడు ఫోకస్ కుదరదు.
  7. తినుబండారాలు, చిరుతిండ్లను స్టడీ టేబుల్‌కు దూరంగా ఉంచాలి. అవి తినకూడదు. అవి ఉంటే…వాటిని తింటూనే ఉంటాం.  ఫలితంగా చదువుకునే టైం తగ్గుతూ పోతుంది.
  8. పిల్లల కోసం ప్రత్యేక గది లేదా స్టడీ రూమ్ ఉంటే వారు చదువుకోవడానికి కూర్చునే దిశకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల బుక్‌కేస్ లేదా బుక్ స్టాండ్ స్టడీ రూమ్‌లో లేదా వారి గదిలో పశ్చిమ దిశలో ఉండాలి. పశ్చిమాన తగినంత స్థలం లేనట్లయితే, మీరు దానిని కొద్దిగా దక్షిణ వైపున అమర్చుకోవచ్చు.

Also Read: Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ

Exit mobile version