Diabetes : ఉదయాన్నే ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి

షుగర్ రోగుల హెల్త్ ను ఫుడ్ ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. ప్రధానంగా ఉదయాన్నే తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎంతో ప్రభావం చూపిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు ఉదయాన్నే మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం.

Diabetes : షుగర్ రోగుల హెల్త్ ను ఫుడ్ ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. ప్రధానంగా ఉదయాన్నే తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎంతో ప్రభావం చూపిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు ఉదయాన్నే మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వారి కడుపు నింపుతుంది. ఫలితంగా గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది. ఇది రోజంతా షుగర్ స్పైక్ లేకుండా రోగికి శక్తిని ఇస్తుంది. విషయానికి వస్తే.. షుగర్ రోగులు (Diabetes) ఉదయాన్నే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వు, ఫైబర్, పిండి లేని ఆహారంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే మంచిది.

చాలామంది మధుమేహ రోగులు ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తూ ఉంటారు. మన కాలేయం రోజంతా శక్తి కోసం గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. షుగర్ రోగులకు (Diabetes) చాలా దాహం అనిపించినా.. తరచుగా మూత్రవిసర్జన వచ్చిన.. ఉదయం అస్పష్టమైన దృష్టి కనిపించినా అది రక్తంలో అధిక చక్కెర స్థాయిని సూచిస్తుంది.

అటువంటి పరిస్థితిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే తప్పనిసరిగా తినవలసిన కొన్ని ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులోకి వస్తుంది.

నెయ్యి మరియు పసుపు పొడి:

ఒక చెంచా ఆవు నెయ్యిలో పసుపు కలిపి తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లు రోజంతా షుగర్ కోసం ఆరాటపడరు. మరోవైపు, పసుపు మంటను తగ్గిస్తుంది.

ఆల్కలీన్ పానీయాలు:

100 ml నీటిలో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ , 30 ml ఉసిరి రసం లేదా నిమ్మరసం కలపడం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఇన్ఫ్యూజ్డ్ వాటర్:

దాల్చినచెక్క శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.  ఇందుకోసం రాత్రిపూట తాగే నీటిలో దాల్చిన చెక్క ముక్కలను వేయండి. కావాలంటే ఈ నీళ్లతో హెర్బల్ టీ కూడా తయారు చేసుకుని తాగొచ్చు.  దాల్చిన చెక్క రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

మెంతి నీరు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట మెంతి గింజలను తీసుకోవాలి. దీని కోసం రాత్రిపూట నీటిలో ఒక చెంచా మెంతి గింజలను నానబెట్టండి. ఈ గింజలను ఉదయాన్నే బాగా నమిలి దాని నీటిని కూడా తాగాలి.

ప్రోటీన్ షేక్:

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే తక్కువ చక్కెర స్థాయి సమస్యను ఎదుర్కోవలసి వస్తే.. నానబెట్టిన బాదం, వాల్‌నట్, ఫ్రూట్స్ తో కూడిన ప్రోటీన్ షేక్ ను తీసుకోవచ్చు.

ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి..

మనం తీసుకున్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తం నంచి ఒంట్లోని కణాలన్నింటికి సరఫరా అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను కణాల చక్కగా ఉపయోగించు కోవాలంటే అందుకు ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ అవసరం. ఈ హార్మోన్‌ను మన శరీరంలోని క్లోమం ఉత్పత్తి చేస్తుంది. కానీ కొందరిలో ఈ క్లోమం ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయలేక, మరికొందరిలో ఉత్పత్తి చేసినా అది సమర్ధవంతంగా పని చేయదు. దీంతో రక్తంలో గ్లూకోజ్‌ నిలిచిపోతుంది. దీన్నే మధుమేహం (చక్కెరవ్యాధి)గా పిలుస్తారు. పరగడుపున పరీక్ష చేస్తే 100 మి.గ్రా చక్కెర శాతం ఉండాలి. ఆహారం తిన్న తర్వాత 160 మి.గ్రా ఉండాలి. అంతకుమించితే షుగర్‌ వచ్చినట్లు నిర్ధారిస్తారు.

Also Read:  Pragya Jaiswal : సోషల్ మీడియాలో సోకుల సునామీ సృష్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్