Site icon HashtagU Telugu

Crying Facts : గుడ్ టైం లేదా బ్యాడ్ టైం.. ఏడుపుతో ఆరోగ్య ప్రయోజనాలు!

Benefits Of Crying

Benefits Of Crying

Crying Facts : ఏడుపు.. బాధ కలిగినా, సంతోషం కలిగినా బయటికి ఉబికి వచ్చే ఒక అద్భుతమైన ఫీలింగ్. కొంతమంది చిన్నచిన్న కష్టాలు, బాధలకే ఏడ్చేస్తారు. ఇంకొంతమంది మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లు మాత్రం బాధలు భారీగా పెరిగినప్పుడు మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటారు. మొత్తానికి కన్నీరు చూడని మనిషి భూప్రపంచంలో లేడు. అప్పుడే పుట్టిన పసికందు దగ్గరి నుంచి కాసేపైతే చనిపోయేందుకు రెడీగా ఉన్న రోగి దాకా అందరూ కన్నీటితో పరిచయం ఉన్నవాళ్లే. సాధారణంగా కన్నీరు కష్టాల టైంలోనే వస్తుంది. అయితే గుడ్ టైంలో వచ్చినా.. బ్యాడ్ టైంలో వచ్చినా కన్నీరు అనేది ఆరోగ్యపరంగా లాభమే కలిగిస్తుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కన్నీళ్లలో 98 శాతం నీరు ఉంటుంది. ఇవి మూడు రకాలు. రిఫ్లెక్స్ అనే రకానికి చెందిన కన్నీళ్లు వస్తే కంటిలోని దుమ్ము, చెత్త  పొగ తొలగిపోతాయి. రిఫ్లెక్స్ కన్నీళ్లు మీ కళ్లను ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడతాయి. భావోద్వేగం వల్ల మీకు వచ్చే కన్నీళ్లలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు, ఇతర టాక్సిన్స్ ఉంటాయి. వీటి వల్ల మీ బాడీ డీ టాక్సిఫై అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • కన్నీళ్ల వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
  • బాధను అధిగమించడానికి కన్నీళ్లు సాయపడతాయి.
  • ఏడిస్తే.. శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మంచి శారీరక, మానసిక అనుభూతిని కలిగిస్తాయి.
  • ఏడుపు వల్ల మీ మెదడు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.
  • ఏడుపు తర్వాత భావోద్వేగాలు కంట్రోల్‌లోకి వస్తాయి.
  • పైవన్నీ ప్రయోజనాలు కాగా.. ఏడుపు వల్ల నష్టం కలిగించే అంశం కూడా ఉంది.  ఎక్కువగా ఏడవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగే ముప్పు(Crying Facts) ఉంటుంది.

Also Read: Soul In Hospital : ఆత్మ కోసం ఆస్పత్రిలో పూజలు.. ఏం చేశారంటే ?

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.