Site icon HashtagU Telugu

Costly Vegetables : ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కూరగాయలు ఇవే..

Costly Vegetables in world high Demand and High Proteins

Costly Vegetables in world high Demand and High Proteins

ఈ మధ్య కాలంలో టమాటో(Tomato) ధరలు కేజీ 250 వరకు పెరిగింది. అదే విధంగా ప్రపంచంలో కొన్ని అత్యంత ఖరీదయిన కూరగాయలు(Costly Vegetables) కూడా ఉన్నాయి. వాటిలో ముందుగా లా బోనొట్ బంగాళాదుంపలు(La Bonnotte Potato) వీటిని ఫ్రాన్స్ లోని ఏకాంత తీరంలో పండిస్తారు. వీటి ధర కేజీ 50 వేల రూపాయల నుండి 90 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇవి మనకు మార్కెట్ లో ప్రతి సంవత్సరం ఒక పది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

జపాన్ లో మాట్సుటాకే పుట్టగొడుగులు శరదృతువు నెలల్లో పెరుగుతుంది. ప్రస్తుతం ఈ పుట్టగొడుగులు ఎక్కువగా పెరగడం లేదు వీటి దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల వార్షిక దిగుబడి వెయ్యి టన్నుల కంటే తక్కువకు పడిపోయింది. అందుకే వీటి ధర ఒక పౌండ్ 75 వేల రూపాయల నుండి 1.5 లక్షల రూపాయల వరకు ఉంది.

ఉత్తర అమెరికాకు చెందిన హాప్ షూట్స్ ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. ఇవి కోన్ ఆకారపు పువ్వుల వలె ఉంటాయి. ఈ హాప్ షూట్స్ ఆకులను బీర్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. ఈ హాప్ లో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ధర కిలో 85 వేల రూపాయల వరకు ఉంటుంది.

వాసబి రూట్.. ఈ మొక్క పెరగడానికి ఖచ్చితమైన తేమ స్థాయిలు, నిర్దిష్ట పోషకాలు అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ఈ మొక్క పెంచడానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని ధర కిలో ఏడు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటుంది.

యమషితా బచ్చలికూర దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని ధర కిలో మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. కూరగాయలలో ఉన్న పోషకాల వలన, అవి పండే వాతావరణం, పరిస్థితులు, దిగుబడి, డిమాండ్ వలన వీటి ధర ఎక్కువగా ఉంటుంది.

 

Also Read : Natu Kodi Pulusu: నాటుకోడి పులుసు ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?