Site icon HashtagU Telugu

Weight Loss for Children : పిల్లలు ఈజీగా సన్నబడాలి అంటే ఇవి తినాలి..

Weight Loss Drinks

Weight Loss Drinks

ప్రస్తుతం పిల్లల్లో (Children) ఊబకాయం పెరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) వెల్లడించింది. ఈ రోజుల్లో పిల్లలు బయటికెళ్తే చాలు సమోసా, పఫ్‌, పిజ్జా, బర్గర్‌ అంటూ ఫాస్ట్‌‌ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా మొబైల్‌, ల్యాప్‌ టాప్‌ ముందేసుకుని గంటలు గంటలు కూర్చుని ఉంటున్నారు. గేమ్స్‌, వ్యాయామం లేకుండా గంటల తరబడి కూర్చొని టీవీ, కంప్యూటర్‌,  మొబైల్‌ తో గడపడం, ఒత్తిడి, ఆందోళనలు వంటివి కూడా వారిలో అధిక బరువుకు (Heavy Weight) దారి తీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చిన్నారుల్లో (Children) అధిక బరువు కారణంగా డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు.

లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారని.. బెంగుళూరులోని జీవోత్తమ ఆయుర్వేద కేంద్రానికి చెందిన డాక్టర్‌‌‌‌ శరద్‌‌‌ కులకర్ణి అన్నారు. పిల్లలకు మ్యాగీ, చాక్లెట్‌, బర్గర్‌, పిజ్జా, చిప్స్‌ లాంటివి అసలు తినిపించకూడదని డా. శరద్‌ కులకర్ణి అన్నారు. పిల్లలకు పాలకూర, బీన్స్‌ ఇవ్వాలని సూచించారు. పిల్లల బ్రేక్‌ ఫాస్ట్‌లో ఓట్స్‌‌‌‌ ఇవ్వాలని అన్నారు. ప్రొటిన్‌ పౌడర్‌‌ నీటిలో కలిపి ఇస్తే వారి ఆరోగ్యానికి మంచిదని అన్నారు. పిల్లలలను ఊబకాయం సమస్య నుంచి దూరంగా ఉంచడానికి కొన్ని సూచనలు చేశారు.

పండ్లు, కూరగాయలు:

పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే వారికి ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. వారి ఆహారంలో కాయగూరలు, పండ్లు, వెన్న తొలగించిన పాలు, పెరుగు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చాలి. ఇక ప్రొటీన్‌ కోసం మాంసం, చేపలు, పప్పుధాన్యాలు, బీన్స్‌ వంటివి ఇవ్వాలి. చిన్నారులకు మొక్కజొన్న, బంగాళదుంప తినిపించడం మంచిది. గ్రేప్స్‌, ఆరెంజ్‌, కివి, బెర్రీస్‌ లాంటి పండ్లు ఇవ్వాలి.

అవకాడో:

చిరుతిండిలో పిల్లలకు అవకాడో ఇవ్వవచ్చు. ఈ పండులో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పిల్లల కడుపు నిండుగా ఉంచుతుంది, దీని వల్ల వారికి ఆకలి తగ్గుతుంది. అవోకాడోలో నాల్గవ వంతు లేదా సగం మాత్రమే పిల్లలకు తినిపించండి. అవకాడోలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

నీళ్లు సరిపడా ఇవ్వండి:

పిల్లల బరువు అదుపులో ఉండాలంటే నీళ్లు సరిపడా తాగడం చాలా ముఖ్యం. నీళ్లను రుచిగా అందించడం కోసం నిమ్మరసం-తేనె, పండ్ల ముక్కలు, తులసి-పుదీనా ఆకులు.. వంటివి కలిపిన నీళ్లు వారికి ఇవ్వాలి. అలాగే కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, స్మూతీస్‌.. వంటివీ వారి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తోడ్పడతాయి.

బ్రకోలీ:

పిల్లలు బ్రోకలీ టేస్ట్‌ను ఇష్టపడరు. కానీ బ్రకోలీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. రోజు విడిచి రోజు వారి ఆహారంలో బ్రకోలీ చేర్చండి. పిల్లల డైట్‌లో పాలకూర, కాలే, మరికొన్ని ఆకుకూరలు కూడా చేర్చండి. వీటిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి మంచివి.

వ్యాయామం తప్పని సరి:

పిల్లలు ఫిట్‌గా, బరువు పెరగకుండా ఉండాలంటే వారికి వ్యాయామం తప్పని సరి. మీతో పాటు వారినీ రోజువారీ వ్యాయామాల్లో భాగం చేయడం మర్చిపోవద్దు. రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికే కాదు.. మానసికంగానూ వారు యాక్టివ్‌గా ఉంటారు.

Also Read:  Easy Weight Loss : ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

Exit mobile version