Site icon HashtagU Telugu

Parenting Style : పిల్లలకు ఏడేళ్ళు వచ్చాకే స్కూల్‌ కు పంపుతారు..

Parenting Style

Parenting Style

మంచి పేరెంటింగ్‌కు ఒక రూల్‌ బుక్‌ అంటూ ఉండదు. ఏ పిల్లలూ (Children) ఒకేలా ఉండరు, ఒకేలా ప్రవర్తించరు. అలాగే ప్రతి తల్లిదండ్రులూ ఒకేలా పిల్లలను పెంచరు. కొంతమంది తల్లిదండ్రులు.. పిల్లలు కొంచెం అల్లరి చేసినా ఎక్కువగా రియాక్ట్‌ అయ్యి వారి మీద అరుస్తూ ఉంటారు, కొన్ని సార్లు చేయి కూడా చేసుకుంటారు. మరికొందరు గారాభం ఎక్కువగా చేస్తుంటారు.. పిల్లలు ఏది కావాలంటే అది వారికి ఇచ్చేస్తారు. కొందరు.. పిల్లలు చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారేమోనన్న భయంతో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటూ ఉంటారు. ఇంకొంత మంది పేరెంట్స్‌.. వాళ్ల పిల్లలకు ఫ్రీడమ్‌ ఇస్తారు. ఇలా ప్రతి ఒక్కరి పేరెంటింగ్‌ స్టైల్‌ (Parenting Style) డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే బయట దేశాలలో.. పేరెంటింగ్‌ స్టైల్‌ (Parenting Style) కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అసలు బయట దేశాలలో పేరెంటింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

జపాన్‌:

మనం పిల్లలను ఒంటరిగా.. పక్క వీదికి పంపడానికే భయపడుతూ ఉంటాం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్ల వద్ద వారే దిగబెడుతూ ఉంటారు. అయితే జపాన్‌ పేరెంట్స్‌ మాత్రం ఈ రకమైన పెంపకానికి విరుద్ధం. అక్కడ ఆరేళ్లొచ్చిన పిల్లలు సొంతంగానే స్కూలుకెళ్లడాన్ని పేరెంట్స్‌ ప్రోత్సహిస్తూ ఉంటారు. మార్కెట్‌కు ఒంటరిగా బస్ జర్నీ చేయడం వెళ్లి సరకులు తీసుకురావడం అలవాటు చేస్తుంటారు. ఈ విధమైన పేరెంటిగ్‌ వల్ల.. వారిలో ధైర్యం, నమ్మకం పెరుగుతుందని పేరెంట్స్‌ భావన.

స్వీడన్‌:

మన దేశంలో.. పిల్లలు తప్పు చేస్తే.. వాళ్లను తిట్టడం, కొట్టడం సాధారణ విషయం. కానీ, స్వీడన్‌లో పిల్లల్ని దండించే అధికారం తల్లిదండ్రులకు లేదు. ఆ దేశంలో తల్లిదండ్రులు పిల్లలను దండించడాన్ని 1979లోనే నిషేధించారు. చిన్నారుల్ని కొట్టడం, తిట్టడం వల్ల వారి మానసిక వికాసంపై నెగటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుందని వారి అభిప్రాయం. దీంతో వాళ్లు చదువులో, ఇతర విషయాల్లో వెనకబడిపోయే ప్రమాదం ఉందని వారి భావన.

ఫిన్లాండ్‌:

ఇక్కడ.. పిల్లలకు మూడేళ్లు రాగానే స్కూళ్లకు పంపేస్తాం. ఎక్కువ రోజులు సెలవులు వస్తే.. ప్రాజెక్ట్‌ వర్క్‌, హోంవర్క్‌తో బిజీ అయిపోతారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలకు ఏడేళ్ల వయసొచ్చేదాకా స్కూల్‌కు పంపరు. ఫిన్లాండ్‌లో ఎక్కువ రోజులు సెలవులొచ్చినా.. ప్రాజెక్ట్‌ వర్క్‌, హోంవర్క్‌ ఇవ్వకుండా ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడాన్నే ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం వల్ల.. పిల్లలు ఇటు శారీరకంగా, అటు మానసికంగా మరింత దృఢంగా ఉంటారంటున్నారని వారి అభిప్రాయం.

ఇటలీ:

పిల్లలు ఏడిచినా, అలిగినా.. వారిని బుజ్జగిస్తూ ఉంటాం. కానీ, ఇటలీలో పిల్లల్ని ఇలా బుజ్జగించడం, బతిమాలడం చేస్తే వాళ్లు మరింత మొండిగా తయారవుతారని.. అది వారి ఎదుగుదల, క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చిన్నారులు ఏడ్చినా, అలిగినా పట్టించుకోకుండా వాళ్లకు ఓపిక ఉన్నంత సేపు ఏడవనీ అని వదిలేస్తారట. అనవసర విషయాలకు ఏడవకూడదన్న విషయం పిల్లలకు అర్థం అవుతుందని వారి అక్కడ తల్లిదండ్రుల భావన.

అర్జెంటీనా:

అర్జెంటీనాలో చిన్నారులు కాస్త ఆలస్యంగా పడుకోవడాన్నే ప్రోత్సహిస్తారట. పేరెంట్స్‌ పనులన్నీ పూర్తయి.. పిల్లలతో కాస్త గడిపేందుకు ఇదే అనువైన సమయమని వారి భావన. ఇద్దరి మధ్య అనుబంధం రెట్టింపవుతుందని ఇలా చేస్తారట.

Also Read:  Chia Seeds : ఈ రెసిపీస్‌తో త్వరగా బరువు తగ్గుతారట..!

Exit mobile version