Cauliflower Health Benefits: కాలీఫ్లవర్ తో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టండి..!

క్యాలీఫ్లవర్‌ (Cauliflower) సూపర్‌ ఫుడ్‌గా నిపుణులు అభివర్ణిస్తారు. దీనిలో మెండుగా ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి (Health)మేలు చేస్తాయని అంటున్నారు. క్యాలీఫ్లవర్‌ (Cauliflower)లో విటమిన్‌ – బి, సి, కె లతో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్‌, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, పాస్పరస్‌, మాంగనీస్‌, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయలలో క్యాలీఫ్లవర్‌ ఒకటి. క్యాలీఫ్లవర్‌తో కూర, వేపుడు, మంచూరియా, క్యాలీఫ్లవర్‌ పకోడీలూ, రైస్‌ ఐటమ్స్‌ కూడా […]

Published By: HashtagU Telugu Desk
Cauliflower Health

Cauliflower Health

క్యాలీఫ్లవర్‌ (Cauliflower) సూపర్‌ ఫుడ్‌గా నిపుణులు అభివర్ణిస్తారు. దీనిలో మెండుగా ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి (Health)మేలు చేస్తాయని అంటున్నారు. క్యాలీఫ్లవర్‌ (Cauliflower)లో విటమిన్‌ – బి, సి, కె లతో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్‌, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, పాస్పరస్‌, మాంగనీస్‌, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయలలో క్యాలీఫ్లవర్‌ ఒకటి. క్యాలీఫ్లవర్‌తో కూర, వేపుడు, మంచూరియా, క్యాలీఫ్లవర్‌ పకోడీలూ, రైస్‌ ఐటమ్స్‌ కూడా చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్‌ను ఎలా చేసినా టేస్ట్‌ మాత్రం అదుర్స్‌ అనిపిస్తుంది. క్యాలీఫ్లవర్‌ సూపర్‌ ఫుడ్‌గా నిపుణులు అభివర్ణిస్తారు. దీనిలో మెండుగా ఉండే పోషకాలు.. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. క్యాలీఫ్లవర్‌లో విటమిన్‌-  బి, సి, కెలతో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్‌, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, పాస్పరస్‌ , మాంగనీస్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

గుండెకు మంచిది:

ఇందులోని సల్ఫోరఫేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ గుండె జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. క్యాలీఫ్లవర్‌లోని పోషకాలు రక్త నాళాలు బిరుసెక్కడం, రక్తపోటు లాంటి సమస్యలను నివారిస్తుంది. రక్తం ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడుతుంది. అందువల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ దాదాపుగా ఉండదు కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు తింటే మంచిది. అలాగే అన్ని రకాల గుండెజబ్బులను అది నివారిస్తుంది.

స్ట్రెస్‌ దూరం అవుతుంది:

క్యాలీఫ్లవర్‌లోని గ్లూకోబ్రాసిసిన్‌, గ్లూకోరాఫనిన్‌, గ్లూకోనాస్ట్రిన్‌లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాలీఫ్లవర్‌లో కోలిన్‌ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి, నరాల వ్యవస్థకు కోలిన్‌ కీలకం. మనలో చాలామంది కొన్ని సార్లు సడెన్‌గా మూడ్‌ బాగోకపోవడం, ఏ పని చేయాలనిపించదు. ఇలాంటి వారికి క్యాలీఫ్లవర్‌ మెడిసిన్‌లా పనిచేస్తుంది. దీనిలోని కొలీన్ మెదడు పనితీరుని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది. క్యాలీఫ్లవర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శారీరక, మానసిక ఇబ్బందులను తొలగించి ఉత్సాహంగా ఉంచుతాయి.

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి:

శరీరంలో విటమిన్‌ కె లోపం ఉంటే ఎముకలు పెళుసుబారడం, విరగడం, ఆస్టియో పొరాసిస్‌ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. క్యాలీఫ్లవర్‌లో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచుగా మన డైట్‌లో తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ – కె గాయాలను త్వరగా నయం చేస్తుంది.

క్యాన్సర్‌కు చెక్‌:

క్యాలీఫ్లవర్‌ యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కాలీఫ్లవర్‌లోని ఇండోల్‌ – 3 – కార్బినాల్‌ అనే స్టెరాల్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాలిఫ్లవర్‌ తరచుగా తీసుకుంటే.. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్‌ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నోటి ఆరోగ్యానికి మంచిది:

క్యాలీఫ్లవర్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలనూ చక్కగా మెరిపిస్తుంది. ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇది దంతాల ఎనామిల్‌పై మరకలు పడకుండా చూస్తుంది.

Also Read:  Weight Loss: చలికాలంలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

  Last Updated: 08 Dec 2022, 12:44 PM IST