Chana Peas : శనగలు తక్కువ తింటారా.. వాటి లాభాలు తెలిస్తే అసలు వదలరు..!

శనగల్లో (Chana Peas) ఉండే పోషక విలువలు తెలియక చాలామంది వాటిని దగ్గరకు రానివ్వరు. కానీ అవి తినడం వల్లే కలిగే ప్రయోజనాలు

Published By: HashtagU Telugu Desk
Chana Peas Uses And Health

Chana Peas Uses And Health

శనగల్లో (Chana Peas) ఉండే పోషక విలువలు తెలియక చాలామంది వాటిని దగ్గరకు రానివ్వరు. కానీ అవి తినడం వల్లే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం వాటిని అసలు వదిలిపెట్టరు. శనగల్లో తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. అందుకే శనగలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో శనగలు ఎక్కువగా ఉపయోగపడతాయి. శనగలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. లివర్ సంబదిత వ్యాధులకు కూడా శనగలు చాలా మంచి ఔషధంగా ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతుంటారు.

శనగలు Chana Peas రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శనగలను పచ్చిగా కాకుండా నాన బెట్టడం లేదా ఉడకబెట్టడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువవుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా శనగలు ఎంతో ఉపయోగపడతాయి.

వీటితో పాటుగా కొలెస్ట్రాల్ తగ్గించడం లో కూడా శనగలు ఉపయోగపడతాయి. ఎముకల పుష్టికి, మలబద్ధక సమస్యలకు, కాల్షియం లోటు ఉన్న వారికి ఇలా ఒకటేంటి శనగలు తరచు తీసుకోవడం వల్ల శరీరం లో జరిగే మార్పులను గుర్తించవచ్చు. అనారోగ్యం వచ్చాక ఎలాగు హాస్పిటల్స్ చుట్టూ తిరగక తప్పదు కానీ అవి రాక ముందే మనకున్న సమస్యలను మన ఇంటి వైద్యం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. వాటిల్లో శనగల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని వాడటం వల్ల ఆరోగ్యం లో మార్పులను గమనించవచ్చు.

Also Read : Onion Peel : ఇమ్యునిటీ పెంచే ఈ సింపుల్ చిట్కా మీకు తెలుసా..?

  Last Updated: 21 Sep 2023, 08:49 PM IST