Site icon HashtagU Telugu

Auto Tips : మీరు మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపుతారా.? దీన్ని గుర్తుంచుకోండి..!

Auto Tips

Auto Tips

Auto Tips : సాధారణంగా చాలా మంది తమ కార్లలోని పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపేస్తారు. ముఖ్యంగా ఇంధన ధరలు పెరుగుతున్న సమయాల్లో లేదా పొడవైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ‘ఫుల్ ట్యాంక్’ చేస్తారు. పర్వత ప్రాంతాలు, గ్యాస్ బంకులు తక్కువగా ఉన్న మార్గాల్లో దీర్ఘ ప్రయాణానికి ముందుగా ఫుల్ ట్యాంక్ చేయడం అనుకూలం. కానీ కారు ట్యాంక్‌ను పూర్తిగా నింపడం సురక్షితమేనా, లేదా దానికి ఏమైనా ప్రమాదాలున్నాయా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

కారు ట్యాంక్ సామర్థ్యం

ప్రతి కారుకు ఇంధన ట్యాంక్ సామర్థ్యం వేరుగా ఉంటుంది. కొన్ని కార్లలో 25 లీటర్ల వరకు, మరికొన్నింటిలో 35 లీటర్ల వరకు పెట్రోల్ లేదా డీజిల్ నిల్వ ఉంటుంది. కానీ ట్యాంక్‌ను అంచు వరకు నింపడం మంచిది కాదు. కారు తయారీదారులు సూచించిన పరిమితి వరకు మాత్రమే ఇంధనం నింపాలి. ఆ పరిమితిని మించితే వాహనానికి హానికరం కావచ్చు.

ట్యాంక్‌ను ఎక్కడ ఆపాలి?

కంపెనీ సూచించిన పరిమితి వరకు నింపడం ఎప్పుడూ సురక్షితం. కానీ ఆ పరిమితిని మీరు ఎలా తెలుసుకుంటారు? మీకు అర్థం కాకపోతే సులభమైన మార్గం ఉంది. మీరు పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుతున్నప్పుడు ‘మొదటి ఆటో కట్’ వచ్చే వరకు మాత్రమే నింపండి. ఆటో కట్ తర్వాత మిగిలిన స్థలాన్ని నింపకపోవడం ఉత్తమం. ఇది ఇంధన ట్యాంక్ , కారు పనితీరుకు మంచిదే కాకుండా సురక్షితమైన పద్ధతిగా భావించబడుతుంది.

ఫుల్ ట్యాంక్ వల్ల సమస్యలు

ట్యాంక్ పూర్తిగా నిండితే అనేక అసౌకర్యాలు ఉంటాయి. కారు నడుస్తున్నప్పుడు గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఎదురైనప్పుడు వాహనం కొద్దిగా కదలికకు గురవుతుంది. అప్పుడు ట్యాంక్‌లోని ఇంధనం పైకి, కిందికి కదులుతుంది. ట్యాంక్ పూర్తిగా నిండి ఉంటే, ఇంధనానికి కదలడానికి స్థలం ఉండదు. ఫలితంగా పెట్రోల్ లేదా డీజిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వాహనాన్ని ఎత్తైన ప్రదేశం లేదా వంగిన ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

సురక్షితమైన పద్ధతి

కాబట్టి ప్రతి సారి ట్యాంక్‌ను అంచు వరకు నింపకపోవడం, కంపెనీ సూచనల మేరకు లేదా మొదటి ఆటో కట్ వద్ద ఆపడం వాహనం దీర్ఘకాలిక పనితీరుకు ఉపయోగకరంగా ఉంటుంది.

Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో పతనం.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్