Site icon HashtagU Telugu

Capsicum Masala Rice : క్యాప్సికంతో ఇలా రైస్ ఎప్పుడైనా చేశారా ? చాలా టేస్టీగా ఉంటుంది

Capsicum Masala Rice simple Recipe prepare at Home

Capsicum Masala Rice simple Recipe prepare at Home

వంటింట్లో ప్రతిరోజూ అనేక రకాల వెరైటీలను వండుతుంటాం. ఇక వీకెండ్ వస్తే.. చాలా మంది వంటింటికే అతుక్కుపోతారు. కొత్తగా ఏ వంటలు చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. వంట ఈజీగా, త్వరగా అయిపోవాలంటే ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవడం ఉత్తమం. అలాంటి జాబితాలో చాలా రైస్ వెరైటీలు ఉన్నాయి. చాలా సులభంగా, టేస్టీగా తయారు చేసుకోగలిగే రైస్ లలో లెమన్ రైస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే టమాటో రైస్, జీరా రైస్, గోబీ రైస్, బగారా రైస్ , పుదీనా రైస్, కొత్తిమీర రైస్, పాలక్ రైస్.. ఇలా రకరకాల రైస్ వెరైటీలు ఉన్నాయి. లంచ్ బాక్స్ లో తీసుకెళ్లేందుకు కూడా ఇవి చాలా బాగుంటాయి.

ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలినపుడు వాటిని ఏదొక ఫ్లేవర్డ్ రైస్ గా చేసుకుంటూ ఉంటాం. క్యాప్సికం మసాలా రైస్ ను ఎప్పుడైనా ట్రై చేశారా ? ఇది లంచ్ బాక్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికంతో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాప్సికం మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో, అందుకు కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

క్యాప్సికం మసాలా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

నూనె – 2 టేబుల్ స్పూన్స్
తరిగిన ఉల్లిపాయ -1
చిన్నగా తరిగిన క్యాప్సికం -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
తరిగిన టమాటా -1
ఉడికించిన పచ్చి బఠాణీ-1/4 కప్పు
పసుపు – 1/4 టీ స్పూన్
జీలకర్ర పొడి -1/2 టీ స్పూన్
ధనియాలపొడి – 1 టీ స్పూన్
చిల్లిఫ్లేక్స్ 2 టీ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
అన్నం -2 కప్పులు
తరిగిన కొత్తిమీర కొద్దిగా.c

క్యాప్సికం మసాలా రైస్ తయారీ విధానం

కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేయించాలి. బఠాణీ వేసి కలిపిన తర్వాత.. పసుపు, జీలకర్ర పొడి, ధనియాలపొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పువేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 2 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం మసాలా రైస్ తయారవుతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడమే.

Also Read : Heart Healthy: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు చేయాల్సిందే..!

 

Exit mobile version