Kids Health: కొన్ని కొన్ని సార్లు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు తొందరగా దగ్గు జలుబు వంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఇలా దగ్గు, జలుబు ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడటం మాత్రమే కాకుండా, ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదో తెలియక చాలామంది తల్లితండ్రులు సతమతమవుతుంటారు. ముఖ్యంగా అరటి పండు, పెరుగు పెట్టొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు పెట్టొద్దని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పేరెంట్స్ ఆ టైంలో పిల్లలకు అరటి పండు, పెరుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ పెట్టడం వల్ల జలుబు పెరుగుతుందని కొందరు, అలాంటిది ఏమి ఉండదని మరికొందరు నమ్ముతారు. అరటిపండులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అరటిపండు సహజంగా మృదువుగా ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుందట. సాధారణంగా జలుబు సమయంలో అరటిపండు తింటే ప్రతికూల ప్రభావం ఉన్నట్లుగా ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొంతమంది పిల్లల్లో దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు తిన్న వెంటనే దగ్గు మరింత పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ అది పిల్లల శరీరతత్వం మాత్రమే. అలాంటి సందర్భాల్లో అరటిపండును తాత్కాలికంగా తగ్గించడం మంచిదని చెబుతున్నారు. పెరుగు సహజ ప్రోబయోటిక్స్‌తో కూడిన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గట్ హెల్త్ ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. జలుబు ఉన్నప్పుడు పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదట. అయితే చల్లగా ఉన్న పెరుగు ఇవ్వకుండా, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. పిల్లలకు అరటి పండు, పెరుగు ఇస్తున్నప్పుడు మోతాదుపై శ్రద్ధ అవసరం. పిల్లల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, ఏ ఆహారం అయినా ఎక్కువ మోతాదులో ఇస్తే కడుపు నిండిపోవడం, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చట. కాబట్టి అరటిపండును చిన్న ముక్కల రూపంలో ఇవ్వడం, పెరుగును తక్కువ మోతాదులో ఇవ్వడం సురక్షితం అని చెబుతున్నారు.
Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు చేసినప్పుడు అరటిపండును తినిపించవచ్చా తినిపించకూడదా? ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Kids Health
Last Updated: 10 Dec 2025, 08:07 AM IST