మన హిందూ సంప్రదాయం అంటే అన్ని దేశాల వారికి గౌరవం. హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి వెనక ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మహిళలకు(Indian Women) ఆభరణాలు. భారతీయ మహిళలు వెండి పట్టీలను(Silver Anklets) కాళ్ళకు(Legs) ధరిస్తారు. అవి పాదాలకు అందాన్ని(Beauty) పెంచడమే కాదు ఆరోగ్యానికి(Health) కూడా మేలు చేస్తాయి. కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఇంటిలో ఆడపిల్ల తిరుగుతుంటే ఇంటిలో మహాలక్ష్మి తిరుగుతున్నట్లు ఉంది అని మన పెద్దవారు అంటూ ఉంటారు.
ఆడవారు కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం వలన అవి చేసే సౌండ్ పాజిటివ్ ఎనర్జీ ని విడుదల చేస్తాయి. ఆడవారు తమ పాదాలకు బరువైన వెండి పట్టీలను పెట్టుకోవడం వలన ఆక్యుప్రెషర్ పాయింట్లను తగ్గిస్తాయి. మహిళలు పట్టీలను కాళ్ళకు ధరించడం వలన శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఆహార విధానాలు, అలవాట్ల వలన మహిళలలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, సంతానలేమి, గర్భ సంచిలో వచ్చే సమస్యలు వంటివి రాకుండా ఉండడానికి మహిళలు కాళ్ళకు ధరించే వెండి పట్టీలు కాపాడతాయి. ఇంకా మహిళలకు శరీరంలో రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి.
ఉద్యోగం చేసే మహిళలైనా, ఇంటిలో ఉండే మహిళలైనా రోజంతా ఎక్కువసేపు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కాళ్ళకు పట్టీలు వేసుకోవడం వలన మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్ళ నొప్పులు రాకుండా కాపాడతాయి. హైహీల్స్ ధరించే వారికి మడమలు వాస్తాయి. కానీ అలాంటి వాపులు కూడా కాళ్ళకు వెండి పట్టీలు ధరించడం వలన తగ్గుతాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం కాళ్ళకు వెండి పట్టీలను మాత్రమే ధరించాలి అంతే కానీ బంగారపు పట్టీలను ధరించకూడదు ఎందుకంటే బంగారాన్ని మనం లక్ష్మీ దేవితో పిలుస్తాము కావున అలా చేస్తే అమ్మవారిని అవమానించినట్లు అని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి వెండి పట్టీలను మాత్రమే మన పాదాలకు ధరించాలి. అందుకే పెళ్ళైన ఆడవాళ్లు మెట్టెలు కూడా వెండివే పెట్టుకుంటారు. వెండి ఆభరణాలు మన శరీరంలోని వేడిని కూడా గ్రహిస్తాయి. ఇప్పుడు పత్తిలో కూడా చాలా రకరకాల డిజైన్స్ వచ్చాయి.
Also Read : Eating Sweets : స్వీట్ తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం..?