Site icon HashtagU Telugu

Bangles : మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలుసా?

Benefits of Wearing Matti Gajulu Bangles by Women

Benefits of Wearing Matti Gajulu Bangles by Women

Bangles : మన దేశంలోని స్త్రీలు అందరూ చేతికి గాజులు వేసుకుంటారు అది ఒక సాంప్రదాయంగా భావిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో పది మందిలో ఐదుగురు మాత్రమే గాజులు వేసుకుంటున్నారు. ఇప్పుడు వేసుకునే బట్టలను బట్టి గాజులు వేసుకోవడం తగ్గించారు. కానీ మట్టి గాజులు వేసుకోవడం అనేది స్త్రీల అందం మాత్రమే కాదు వారికి ఆరోగ్యం పరంగా కూడా మంచిది. అందుకే పూర్వ కాలంలో ఎక్కువమంది మట్టి గాజులు వేసుకునేవారు. మహిళలకు గర్భిణీ అయినప్పుడు లేదా పెళ్లి అయినా ఏదయినా ఫంక్షన్ జరిగినా మట్టి గాజులు వేసి దీవిస్తారు. ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి కాబట్టి.

మట్టి గాజులు వేసుకోవడం వలన స్త్రీలలో గాజులు పైకి కిందకు జరిగి మణికట్టు ప్రదేశంలో రాపిడి జరిగి రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత స్త్రీలలో రాకుండా ఉండడానికి కూడా సహాయపడతాయి. మగవారి కంటే ఆడవారి శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి హార్మోన్లు బాలన్స్ తప్పుతాయి కానీ అలా జరగకుండా గాజులు వేసుకోవడం వలన కాపాడతాయి.

గర్భిణీ స్త్రీలు గాజులు వేసుకోవడం వలన కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మట్టి గాజులు వేసుకోవడం వలన గర్భిణీలకు వచ్చే అలసట తట్టుకోవడానికి సహాయపడతాయి. ఒత్తిడి, నొప్పులను భరించే సామర్ధ్యాన్ని మట్టి గాజులు మహిళల శరీరంలో పెంచుతాయి. ఇప్పుడు తినే జంక్ ఫుడ్ వలన శరీరంలో వేడి పెరుగుతుంది. మట్టి గాజులు వేసుకోవడం వలన అవి మన శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మానసికంగా, ఆరోగ్యంగా ఉండడానికి మట్టి గాజులు ఉపయోగపడతాయి. మట్టిగాజులు చేసే సౌండ్ కూడా చెవులకు మంచిది.

 

Also Read : Mamidikaya Pulihara : సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార తయారీవిధానం..