Pet Dog : కుక్కను పెంచుకోవడం వలన కాపలా ఒకటే కాదు.. ఎన్నో ప్రయోజనాలు..

పెంపుడు జంతువుగా మనం పెంచుకునే వాటిలో కుక్క(Dog) మొదటిది. కొంతమంది కుక్కను ఇష్టంతో, మరికొంతమంది సేఫ్టీ కోసం పెంచుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 08:54 PM IST

పెంపుడు జంతువుగా మనం పెంచుకునే వాటిలో కుక్క(Dog) మొదటిది. కొంతమంది కుక్కను ఇష్టంతో, మరికొంతమంది సేఫ్టీ కోసం పెంచుకుంటూ ఉంటారు. కుక్కను పెంచుకుంటే అది విశ్వాసానికి మారుపేరు గా ఉంటుంది. ఇంకా ఎంతోమంది యజమానుల ప్రాణాలను కష్టమైన పరిస్థితులలో కాపాడతాయి. కుక్కను పెంచుకోవడం అనేది మన ఇంటికి వాస్తు పరంగా కూడా మంచిదని చెబుతున్నారు. కుక్కను మనం కాలభైరవుడుగా పూజిస్తాము. కుక్కను పెంచడం వలన మనకు దేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది.

కుక్కకు రోజూ కడుపు నిండా ఆహారం పెట్టడం వలన శని దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనం ఉదయం లేచిన వెంటనే కుక్కను చూడడం వలన శుభాలు జరుగుతాయని పూర్వం ఒక నమ్మకం కూడా ఉండేది. కుక్కను ప్రేమగా పెంచుకోవడం వలన మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఏమైనా పని ఒత్తిడి ఉన్నా లేదా దేని వలన అయిన ఒత్తిడికి గురయితే పెంపుడు జంతువుతో కాసేపు ఆడుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

కుక్క ఇంట్లో తిరుగుతుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకంటే కుక్క తిరగడం వలన మనలో ఉత్సాహం పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. చాలామంది కుక్కలు అందంగా ఉండాలని బొచ్చు ఎక్కువగా ఉన్నవి తెల్లగా ఉన్నవాటిని పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మనం నల్లని కుక్కను పెంచుకుంటే శని, రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మనం మన ఇంటిలో పెంపుడు జంతువుగా కుక్కను పెంచుకోవడం వలన మన ఆరోగ్యానికి, మన మానసిక ప్రశాంతతను పొందుతాము. అయితే కుక్కని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. దానికి రెగ్యులర్ గా స్నానం చేపించాలి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Also Reda : Delhi pollution: వాయు కాలుష్యం నుంచి ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు