Site icon HashtagU Telugu

Donkey Milk : గాడిద పాలతో ఎన్ని లాభాలో.. తెలిస్తే మీరూ మిస్ చేయరు

Benefits of Drinking Donkey milk

Benefits of Drinking Donkey milk

పాలు(Milk) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే కాల్షియం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి వేళలో ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు(Doctors) కూడా సూచిస్తుంటారు. అయితే పాలు అంటే మనం వాడేవి ఆవు(Cow) లేదా గేదెల నుండి తీసిన పాలు. కానీ గాడిద(Donkey) పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా తక్కువమందికి తెలుసు. గాడిద పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గాడిద పాలు అనగానే చాలా మంది ఛీ ఛీ అవికూడా తాగుతారా అనుకుంటారు. కానీ వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వాటిని ఖచ్చితంగా తాగుతారు. నిజానికి ఆవు/గేదెల పాలకంటే గాడిద పాలకు గిరాకీ ఎక్కువ.

గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా వీటిలో ఉంటాయి.

ఇంచుమించు తల్లి పాలలో లభించే ఔషధ గుణాలు గాడిద పాలలోనూ ఉంటాయి. గాడిద పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

గాడిద పాలలో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఈ పాలు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు గాడిద పాలను తాగడం వల్ల అలసట తెలియదు.

ప్రతిరోజూ గాడిద పాలు తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, విటమిన్ ఇ కూడా లభిస్తాయి.

వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

గాడిద పాలలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

గాడిద పాలను పురాతన కాలంలో రుమాటిక్స్, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు. ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్, ముఖారవిందాన్నిచ్చే వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

 

Aso Read :   Green Mango : ప్రాణాంతక వ్యాధిని దూరంచేసే పచ్చిమామిడి.. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలెన్నో