Clay Pot Water : ఈ రోజుల్లో ఫ్రిజ్(Fridge) లేని ఇల్లు లేదు. మామూలుగానే చాలామంది కూలింగ్ వాటర్ తాగుతుంటారు. అలాగే ఎండాకాలం(Summer) రాగానే ఫ్రిజ్ వాటర్ ఇంకా ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఫ్రిజ్ లో నీరు తాగడం వలన మన ఆరోగ్యానికి మంచిది కాదు. పాతకాలంలో వేసవి కాలం రాగానే మట్టికుండలో నీరు తాగేవారు. ఇప్పటికి కూడా పల్లెటూళ్లలో మట్టికుండల్లో నీళ్లు తాగుతుంటారు.
మట్టికుండలో నీరు తాగడం మన ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
*మట్టికుండను బంకమట్టితో తయారుచేస్తారు. ఇది సహజ ఆల్కలీన్ గా చెప్పబడుతుంది. దీనిలో నిలువ ఉంచిన నీటి ph లెవెల్ ను బ్యాలెన్స్ చేస్తూ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
* మట్టికుండలో నీరు తాగితే మలబద్దకం వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది.
* బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
* వేసవిలో వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.
* వేసవిలో వచ్చే అలర్జీలు కూడా రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.
* మట్టికుండలో నీరు తాగితే శరీరంలోని గాయాలను హీల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
* గొంతు నొప్పి వంటిని కూడా తగ్గించడానికి కుండలో నీరు ఉపయోగపడుతుంది.
* మన శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా మట్టి కుండలో నీరు ఉపయోగపడుతుంది.
* ఫ్రిడ్జ్ లో నీరు ఎంత తాగినా తొందరగా దాహం తీరదు, అదే మట్టికుండలో నీరు తాగితే దాహం త్వరగా తీరుతుంది. అందుకే ఎండాకాలంలో మట్టికుండలో నీరు తాగమంటారు పెద్దలు. ఆరోగ్యానికి మంచిది, చల్లగా కూడా ఉంటాయి.
Also Read : Cauliflower Rice : క్యాలీఫ్లవర్ రైస్ తెలుసా? వైట్ రైస్ బదులు.. ఆరోగ్యం కోసం..