Coconut Water : కొబ్బరి నీళ్ళు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

కొబ్బరి నీళ్ళు(Coconut Water) తాగడం వలన కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 10:00 PM IST

కొబ్బరికాయ(Coconut)ను తింటే అది మన ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు(Coconut Water) తాగడం వలన కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనం నీరసంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు కొబ్బరి నీళ్ళే తాగమని డాక్టర్లు సైతం చెప్తారు. కొబ్బరి నీళ్ళల్లో ఎలక్ట్రోలైట్లు, లారిక్ ఆసిడ్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల కొబ్బరినీళ్ళల్లో 95 శాతం నీరు ఒక గ్రాము కంటే తక్కువ కొవ్వు, నాలుగు గ్రాముల కార్బోహైడ్రాట్లను కలిగి ఉంటుంది. వంద గ్రాముల కొబ్బరినీళ్ళల్లో 14 గ్రాముల కాలరీలు మాత్రమే ఉంటాయి.

* కొబ్బరి నీళ్ళను తాగడం వలన అవి మన శరీరంలో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది.
* కొబ్బరినీళ్ళల్లో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది.
* కొబ్బరినీళ్ళు తాగడం వలన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
* కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు కొబ్బరినీళ్ళు తాగడం వలన ప్రయోజనం ఉంటుంది.
* కొబ్బరినీళ్ళు తాగడం వలన అవి మన జుట్టుకు పోషణ ఇచ్చి చుండ్రు రాకుండా కాపాడుతుంది.
* కొబ్బరినీళ్ళు తాగడం వలన అవి మన చర్మం నిగారింపును మెరుగుపరుస్తుంది.
* కొబ్బరినీళ్ళను రోజూ తాగడం వలన మన శరీరం డీహైడ్రేట్ కు గురి కాకుండా కాపాడుతుంది.
* మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగడం వలన మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది.
* కొబ్బరినీళ్ళు తాగడం వలన మన కడుపు నిండుగా ఉండి తక్కువగా తింటారు. దీని వలన బరువు తగ్గుతారు. ఊబకాయంతో ఉన్నవారు కొబ్బరినీళ్ళను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇవే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజూ ఒక గ్లాసు అయినా కొబ్బరి నీళ్లు తాగితే మంచిది.

 

Also Read : Yoga Poses For Sinus: సైనస్ తో సతమతమవుతున్నారా.. అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి..!