అంజూరలో(Anjura) అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అంజూరను(Anjeera) డ్రై ఫ్రూట్ గా తింటూ ఉంటారు. దీనినే అత్తిపండు అని కూడా అంటారు. అంజూరను(Dry Figs) చలికాలంలో తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంజూరలో విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, సల్ఫర్, సోడియం, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.
* అంజూర తినడం వలన అది చలికాలంలో మన శరీరానికి వేడిని అందిస్తుంది.
* చలికాలంలో మన శరీరంలో జీర్ణ వ్యవస్థను అంజూర మెరుగుపరుస్తుంది.
* అంజూరలో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉండే క్యాన్సర్ కు కారణమయ్యే ట్యాక్సిన్ ను బయటకు పంపేలా చేస్తుంది. దీని వలన క్యాన్సర్ కి గురి కాకుండా ఉంటారు.
* అంజూర రోజూ తినడం వలన దానిలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
* అంజూర తినడం వలన దానిలో ఉండే ఫైబర్ మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
* అంజూరలో ఉండే ఫినాల్ మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మన శరీరంలో ఉండే చెడు కొవ్వులను బయటకు పంపిస్తాయి. దీని వలన గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
* అంజూరలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి.
* అంజూరలను ఉడకబెట్టుకొని కూడా తినవచ్చు. ఉడకబెట్టిన అంజూరాలను తిని పాలు తాగవచ్చు. ఇలా చేయడం వలన మన శరీరంలో బలహీనత తగ్గుతుంది.
* లైంగిక సమస్యలు ఉన్న మగవారు ఎండు అంజూర ముక్కలు, బాదం పప్పులను వేడి నీటిలో మరిగించుకోవాలి. వాటికి కొద్దిగా పంచదార, యాలకులు, చిరోన్జీ, పిస్తాలను కలిపి దానిని ఒక వారం రోజుల పాటు నెయ్యిలో ఉంచాలి. దీనిని రోజుకు ఇరవై గ్రాముల చొప్పున తింటే మగవారికి మంచి ఫలితం ఉంటుంది.
Also Read : Cough – Cold : చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గడానికి.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..