శరీరంలో ఎముకలు, దంతాలు, కండరాలని హెల్దీగా ఉంచడంలో విటమిన్ డీ (Vitamin D) కీ రోల్ పోషిస్తుంది. పిల్లల్లో రికెట్స్, ఎముకల సమస్యలు రాకుండా ఉంటుంది. కండరాల సమస్యలు రాకుండా ఉంటుంది. ఎముకల నొప్పుల రాకుండా చూస్తుందని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది.
విటమిన్ డి (Vitamin D) తక్కువగా ఉంటే..
లక్షణాలు ఏంటంటే:
- అలసట
- తగినంత నిద్ర లేకపోవడం
- ఎముకల నొప్పి
- డిప్రెషన్
- జుట్టు రాలడం
- కండరాల బలహీనత
- ఆకలి లేకపోవడం
ఏం తినాలంటే:
NHS ప్రకారం, సూర్యరశ్మికి, ఆరోగ్యకరమైన, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల సరిపడా విటమిన్ డి అందుతుంది. అయినప్పటికీ, చలికాలంలో సూర్యరశ్మి లేని కారణంగా ఎండ తగలదు. దీంతో విటమిన్ డి సరిగ్గా అందక లోపం ఉంటుంది.
విటమిన్ డి (Vitamin D) ఏయే ఫుడ్స్‌లో ఉంటుందంటే:
- చేపలు
- ఆయిలీ ఫిష్
- సాల్మన్
- సార్డినెస్
- హెర్రింగ్
- మాకేరెల్
- రెడ్ మీట్
- లివర్
- గుడ్డు పచ్చసొన
- ఫోర్టిఫైడ్ ఫుడ్స్
- ఫ్యాట్ ఫుడ్స్
- సెరల్స్.
- ఎండ
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మాత్రమే కాదు.. రోజువారీ విటమిన అవసరాన్ని తీర్చుకునే మార్గాలు కాదు..
సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే:
NHS ప్రకారం, ప్రజలు ఆహారం నుండి తగినంత విటమిన్ డి పొందడం కష్టం కాబట్టి, ప్రతి ఒక్కరూ పాలిచ్చే వారు డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ముఖ్యం. కానీ, ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది ఎముకలని బలహీనపరుస్తుంది, మూత్రపిండాలు, గుండెను దెబ్బతీస్తుంది.
ఎంత తీసుకోవాలంటే:
సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు సహా పెద్దలు, విటమిన్ డి లోపం ఉన్నవారికి రోజుకి 10 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. 1 సంవత్సరముల వయస్సు వరకు పిల్లలకు రోజుకు 8.5 నుండి 10 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరమని హెల్త్ బాడీ చెబుతోంది.
Also Read: Uric Acid: ఈ పండ్లు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువవుతుంది