Site icon HashtagU Telugu

Biryani Lovers: మీరు ఎక్కువగా బిర్యానీ ని తింటుంటే జాగ్రత్తపడండి

Be Careful If You Eat A Lot Of Biryani

Be Careful If You Eat A Lot Of Biryani

బిర్యానీపై మనసు పారేసుకోని వాళ్లు ఎవరుంటారు? బిర్యానీ (Biryani) ఇష్టం లేని వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ. అందులో హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఇక హైదరాబాద్‌లో బ్యాచీలర్స్‌ ఎక్కువగా బిర్యానీనే తింటుంటారు. అయితే ఇలా తరుచుగా బిర్యానీ తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. మాంసారాల్లో ఎన్ని ఉన్నా ఎక్కువగా చికెన్‌ (Chicken)నే ఇష్టపడి తింటారు. మిగతా వాటితో పొల్చుకుంటే చికెన్ ధర కూడా తక్కువే. వీకెండ్‌ వస్తే మూడు పూటల బిర్యానీ లాగించేవారున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు రెస్టారెంట్, హోటల్స్ రకరకాలు వైరటీలు అందిస్తూ చికెన్ ప్రియుల మనసు దోచుకుంటూ ఉంటాయి.

చికెన్‌లో ఎన్ని వైరెటీలు ఉన్న చికెన్ బిర్యానీ (Chicken Biryani) ప్రత్యేక వేరు. బిర్యానీ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది . సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఇక్కడి బిర్యానీపై మనసు పారేసుకుంటుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బ్యాచీలర్స్‌ ఎక్కువగా బిర్యానీనే తింటుంటారు. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు.. తరుచుగా బిర్యానీ తినడం ఏ మాత్రం మంచిది కాదట. నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్‌ వెజ్‌ వంటకాలే ఉంటున్నాయి.

ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్‌ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అటు యూత్‌కు కూడా చాలా ఆరోగ్య సమస్యలు లాంగ్‌ టర్మ్‌లో వస్తాయంటున్నారు డాక్టర్లు. మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే క‌డుపులో ఏదో ఒక సమస్య రావడం కన్ఫమ్‌ అంటున్నారు. ఇక హోటల్ బిర్యానీ ఎక్కువగా తినడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటున్నారు.

బిర్యానీలో హోటల్స్ లో వాడే పదార్థాలు అంత ఆరోగ్యకరమైనవి కావు అని, తరచు బయట బిర్యానీ తినేవారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. మితంగా తింటే పర్వాలేదు గాని… తరచుగా తింటే మాత్రం ముప్పు తప్పదని చెబుతున్నారు.

Also Read:  E2GO రూ. 60 వేల ఎలక్ట్రిక్ స్కూటర్. రూ. 2 వేలకే సొంతం చేసుకోవచ్చు.