Site icon HashtagU Telugu

Summer : వేసవిలో ఈ మషాలా దినుసులకు దూరంగా ఉండాల్సిందే.. అవి ఏంటంటే..?

Heat Stroke Remedies

Avoid These Spicy Items in Summer

Summer : వేసవిలో దూరంగా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వేసవిలో స్పైసీ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే కొన్ని స్పైసీ పదార్థాలకు వేసవిలో దూరంగా ఉంటే మంచిది.

అల్లం అనేది మన శరీరానికి వేడిని తెస్తుంది కాబట్టి వేసవి కాలంలో అల్లం ఆహారంలో తక్కువగా వాడాలి. ఎక్కువ మొత్తంలో ఆహారంలో అల్లం ఉపయోగిస్తే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వేసవిలో మిరపకాయలను ఎక్కువగా తినకూడదు ఎందుకంటే మిరపకాయలలో ఉండే క్యాప్సయిసిన్ శరీరంలో చిరాకు, మంట ను కలిగిస్తాయి.

వెల్లుల్లి తినడం వలన అది మన శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి ఎండాకాలంలో వెల్లుల్లిని మితంగా తినాలి. ఎక్కువగా తింటే శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దీని వలన నోటిలో అల్సర్లు వంటివి వస్తాయి.

హేమోరాయిడ్స్, మెనోరాగియా, ఎపిస్టాక్సిస్ పలు రకాల రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు వేసవిలో లవంగాలు తినకుండా వాటికి దూరంగా ఉండాలి.

రక్తంలో మంటతో బాధపడేవారు ఎండాకాలంలో ఇంగువను ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి వేసవికాలంలో లవంగాలు, అల్లం, వెల్లుల్లి, ఇంగువ, మిరపకాయలు వంటివి మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 

Also Read : Cauliflower Rice : క్యాలీఫ్లవర్ రైస్ తెలుసా? వైట్ రైస్ బదులు.. ఆరోగ్యం కోసం..