Avoid Sugar : పంచదార తినడం పూర్తిగా మానేస్తే.. ఈ హెల్త్ బెనిఫిట్సన్నీ మీ సొంతం..

షుగర్ తినడం మానేస్తే.. హైబీపీ, ట్రైగ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రావు. దానివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికీ చక్కెర కీడు చేస్తుంది. సో చక్కెర మానేస్తే.. నోటి సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 05:15 PM IST

Avoid Sugar in Your Life : మనం ప్రతిరోజూ తినే ఆహారంలో.. ఏదొక రకంగా పంచదార తీసుకుంటాం. టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్.. ఇలా ఏదొక రూపంలో పంచదార మన ఆహారంలో ఒక భాగమైపోయింది. పంచదార తినడం వల్ల మన ఆరోగ్యానికేమైనా మేలు జరుగుతుందా అంటే.. అది సున్నా అని చెప్పాలి. పైగా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి పంచదారను తినడం మానేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైతే పంచదార తినడం పూర్తిగా మానేస్తారో.. వారి ఆరోగ్యం మొత్తం పూర్తిగా మెరుగుపడుతుంది. పంచదారను తినకపోవడం వల్ల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినాలన్న కోరిక కూడా పెరిగుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. పంచదార పూర్తిగా మానేస్తే.. శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గిపోతాయని ఆలోచిస్తున్నారా ? మనం తినే అన్నం, ఫ్రూట్స్ లో ఉండే నేచురల్ షుగర్స్ సరిపోతాయి.

చక్కెర ఉన్న పానీయాలు, పదార్థాలు తినడం మానేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. చక్కెర తింటే శరీరంలో క్యాలరీలు చేరుతాయే తప్ప తగ్గవు. వాటిలో పోషక విలువలేవీ ఉండవు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కచ్చితంగా చక్కెరతో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి.

షుగర్ తినడం మానేస్తే.. హైబీపీ, ట్రైగ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రావు. దానివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికీ చక్కెర కీడు చేస్తుంది. సో చక్కెర మానేస్తే.. నోటి సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. మానసిక స్థితి ఆరోగ్యంగా మారుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం వంటివి రావు. ఏకాగ్రత పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సవ్యంగా సాగాలన్నా, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా చక్కెర నిండిన ఆహారాలను తినడం పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : World Kidney Day 2024: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల్సిందే..!