Effective Face Packs for Pores on Face : చాలామంది స్త్రీ పురుషులు ముఖంపై రంద్రాలు గుంతలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమల తాలూకా మచ్చలు కొన్ని కొన్ని సార్లు అలాగే గుంతలుగా రంధ్రాలుగా మారి అలాగే ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ లు వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నాలుగు రకాల ప్యాక్ లు ట్రై చేస్తే చాలు.
We’re now on WhatsApp. Click to Join.
ఇందుకోసం తేనె ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, పంచదార పావు టీ స్పూన్ ఈ మూడు పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి ముఖానికి (Face) అప్లై చేసి మసాజ్ చేయాలి.10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉన్న మురికి, మృత కణాలు బయటకొస్తాయి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే రంధ్రాలు తగ్గుతాయి.
మరొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే.. దోసకాయ రసం 4 చెంచాలు, రోజ్ వాటర్ 2 స్పూన్లు తీసుకోవాలి. అయితే ముందుగా రోజ్ వాటర్, దోసకాయ రసం రెండింటినీ గిన్నెలో బాగా మిక్స్ చేసి ముఖం (Face)పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గి రంధ్రాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అప్పుడు మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.
మరొక ప్యాక్ విషయానికి వస్తే.. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు.. శనగపిండి 1 చెంచా పసుపు పావు చెంచా పెరుగు 2 చెంచాలు ఆలివ్ ఆయిల్ 1 చెంచా. ముందుగా శనగపిండి, పసుపు, ఆలివ్ ఆయిల్ పెరుగుతో కలిపి ఒక గిన్నెలో మెత్తగా పేస్టులా చేయాలి. మీ ముఖాన్ని చక్కగా క్లీన్ చేసి 20 నిమిషాల పాటు అలానే ఉండి ఆ తర్వాత ముఖాన్ని మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. శనగపిండి చర్మ రంధ్రాల్లో మలినాలని తొలగిస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లని దూరం చేస్తాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా, రంధ్రాలను తగ్గిస్తుంది.
మరో ప్యాక్ కోసం పెరుగు 2 చెంచాలు, శనగపిండి 1 చెంచా.. ముందుగా పెరుగులో శనగపిండి కలిపి 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత నెమ్మదిగా నీరు చల్లి వేళ్ళతో మృదువుగా మసాజ్ చేసి క్లీన్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి.
Also Read: Health Benefits: ఉదయాన్నే టీకి బదులుగా ఆ జ్యూస్ తాగితే చాలు.. ఎన్నో ప్రయోజనాలు?