Insomnia : నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

  • Written By:
  • Publish Date - November 27, 2023 / 06:20 PM IST

Insomnia : ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా అర్ధరాత్రి అవుతున్న కూడా సరిగా నిద్ర పట్టగా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమంది టీవీలు మొబైల్ ఫోన్లు లాప్టాప్ లు చూస్తూ కలెక్షన్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కోవడం వల్ల క్రమంగా ఈ నిద్రలేని సమస్య మొదలవుతుంది. ఇలా ఎక్కువ టైం మెలకువతో ఉండడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా చాలామంది అలాగే ప్రవర్తిస్తూ లేని కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి టెన్షన్స్, ఒత్తిడిలు కారణంగా రాత్రి సమయంలో నిద్ర రాదు. నిద్ర లేకుండా గడిపే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

We’re Now on WhatsApp. Click to Join.

అయితే రాత్రి సమయంలో నిద్ర త్వరగా రావాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. ప్రధానంగా మొబైల్స్ కు లాప్టాప్ లు చూడడం మానుకోవాలి. రాత్రి సమయంలో వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం వలన త్వరగా నిద్ర వస్తుంది అలాగే ఇలా రాత్రి సమయంలో అందరూ స్నానం చేయకూడదు. ప్రధానంగా గర్భవతులు, చిన్నపిల్లలు రాత్రి సమయంలో స్నానం చేయకూడదు. ఇక స్నానం చేయని వారు రాత్రివేళలో కాళ్లు శుభ్రపరచుకోవచ్చు.

ఆ తర్వాత చల్లగా ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె కొద్దిగా మర్దన చేస్తే మంచి నిద్రవస్తుంది. అదేవిధంగా నిద్రించే గది శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. నిద్రపోయేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. శుభ్రత అనేది రాత్రి సమయంలో పడుకునే టైంలో దుస్తులు ఇరుకుగా లేకుండా లూస్ గా ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయానికి రెండు గంటల ముందు స్క్రీన్ లకు దూరంగా ఉండాలి. ఇలా పైన చెప్పిన విషయాలు అన్ని పాటించడం వల్ల నిద్రలేమి (Insomnia) సమస్య దూరం అవుతుంది.

Also Read:  Banana Vs Foods : అరటిపండుతో ఈ ఫుడ్స్ కలిపి తినొద్దు