Chapped Lips Tips : చలికాలం పెదవులు పగిలి ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ చిట్కాలను ఉపయోగించాల్సిందే..

చలికాలంలో పెదవులు పగిలి (Chapped Lips) రక్తం వస్తూ ఉంటే ఆ సమస్య నుంచి ఇలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

Published By: HashtagU Telugu Desk
Are You Suffering From Chapped Lips In Winter.. But These Tips Should Be Used..

Are You Suffering From Chapped Lips In Winter.. But These Tips Should Be Used..

Tips for Chapped Lips in Winter Season : చలికాలం వచ్చింది అంటే చాలు చాలా మందికి చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి చలికాలం చర్మం మొత్తం పొడిబారి మంటగా అనిపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా పెదవులు పగిలి (Chapped Lips) కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. పెదాల నుంచి రక్తం రావడంతో పాటు పెదవులు పగిలి (Chapped Lips) అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. చలికాలంలో పెదవులు పగిలి (Chapped Lips) రక్తం వస్తూ ఉంటే ఆ సమస్య నుంచి ఇలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

పెదవులు పగిలినప్పుడు చక్కెర, తేనె వాడడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దానికోసం పంచదార, తేనెను మిక్స్ చేసి పెదవులకి రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి నూనె కూడా పెదాలకి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. కొబ్బరి నూనె వాడడం వలన చర్మంపై తేమశాతం అధికమవుతుంది. కావున పెదవలకి కొబ్బరి నూనె అప్లై చేయడం వలన పెదవులు మృదువుగా మారి గులాబీ రంగులోకి వస్తాయి. పొడి బారిన పెదవులకు పాలు కూడా చాలా బాగా ఉపయోగపడితే దానికోసం పాలలో కాస్త కాటన్ నుంచి పెదవులపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వలన పెదవులు పొడిబారకుండా పగుళ్లు రాకుండా ఉంటాయి. అలాగే పగిలిన పెదవులకు గులాబీ రేకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకోసం గులాబీ రేకులను పాలతో కలిపి పెదవులకి రాయాలి.

గులాబీ రేకుల్లో ఉండే విటమిన్ ఈ పెదవులకి పోషణ అందేలా చేస్తుంది. కలమంద కూడా పెదవులకి చాలా బాగా సహాయపడతాయి. పెదవులు పగిలిన వారు కలమందను పెదవులపై పెట్టుకోవడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. రాత్రి పడుకునే ముందు కలమంద జెల్లి పెదాలకు రాసుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేయడం వలన పెదవులు పింక్ కలర్ లోకి వస్తాయి. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయలు పొడి వారిని పెదవులకి చక్కగా పనిచేస్తాయి. దానికోసం ఆముదం నూనె తీసుకొని దాన్లో కొద్దిగా నిమ్మరసం కలిపి దాన్ని పెదవులకి రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చలికాలంలో ఇంట్లోనే దొరికే వాటితో ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు పెదవులు పగలకుండా ఉండడంతో పాటు నల్లగా ఉన్న పెదాలు కూడా ఎరుపు రంగులోకి వస్తాయి.

Also Read:  Auto Driver: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్, 8 లక్షలు నగల బ్యాగ్ అప్పగింత!

  Last Updated: 30 Dec 2023, 01:43 PM IST