Banana Tips : డార్క్ సర్కిల్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అరటి పండుతో ఇలా చేయాల్సిందే?

అరటిపండు (Banana) తొక్క కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వీటిని సరిగ్గా వాడడం వల్ల కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ దూరమవుతాయి.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 04:35 PM IST

Banana Tips and Benefits : ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అంతా కూడా అందంగా ఉన్న కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ విషయం పట్ల అనేక రకాల చిట్కాలను, బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విషయం పట్ల స్త్రీలు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ డార్క్ సర్కిల్స్ సమస్య ఎందుకు వస్తుంది అన్న విషయానికి వస్తే.. నిద్రసరిగ్గా పోకపోవడం, పోషకాహార లోపం కారణంగా కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి.

We’re Now on WhatsApp. Click to Join.

వీటిని పోగొట్టేందుకు కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. అందులో అరటిపండు (Banana) తొక్క కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వీటిని సరిగ్గా వాడడం వల్ల కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ దూరమవుతాయి. అయితే మరి అరటిపండుతో డార్క్ సర్కిల్స్ ని ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మనకు అరటిపండు (Banana) తొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్కలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తొక్కలో విటమిన్ ఎ, బి, సి, ఇ జింక్‌లు ఉంటాయి. దీనిని వాడడం వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు దూరమై చర్మాన్ని మెరుగ్గా చేస్తాయి. అరటిపండు తొక్కలో ఉండే కొల్లాజెన్ పెంచి రక్తప్రసరణ మెరుగ్గా చేసే గుణాలు ఉన్నాయి.

అయితే కళ్ళ కింద ఉండే నల్లని వలయాలను తొలగించడం కోసం ముందుగా అరటిపండు తొక్కను ఫ్రిజ్ లో ఉంచాలి. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లోనే పెట్టాలి. తర్వాత కంటి చుట్టూ అప్లై చేయాలి. తొక్కలని ముక్కలుగా చేసి సుమారు 15 నిమిషాల పాటు కళ్ళ కిందే ఉంచండి. తర్వాత నీటితో ముఖాన్ని కడగాలి. దీనిని వారంలో 2, 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ముందుగా అరటిపండు తొక్కను కొద్దిగా పీల్ చేసి పేస్టులా చేయాలి. ఇందులో 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం, తేనె కలపాలి. తర్వాత తయారు చేసుకున్న పేస్టుని కళ్ళ కింద అప్లై చేయాలి. తర్వాత 8 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. దీని వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి. అలాగే అరటిపండు తొక్కని పేస్టులా చేసి అందులో అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. తర్వాత తయారు చేసిన పేస్టుని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ముఖ్యంగా కళ్ళ కింద వేయాలి. ఆరిన తర్వాత నీటితో కడుక్కోవాలి. దీంతో డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుతాయి. ఇలా అరటిపండుతో ఈ విధమైన చిట్కాలు పాటించడం వల్ల డార్క్ సర్కిల్ సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read:  Black Friday Sale America : అమెరికాలో మొదలైన బ్లాక్‌ ఫ్రైడే సేల్‌..ఆఫర్లు మాములుగా లేవు