Life Style : చాలామంది ఎంత సంపాదించినా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం తక్కువ సంపాదన కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాది వేయడం. అనూహ్య ఖర్చులు, దీర్ఘకాలిక లక్ష్యాలు (ఇల్లు కొనడం, పిల్లల చదువులు, రిటైర్మెంట్) సాధించాలంటే పొదుపు తప్పనిసరి. మరి పొదుపు ఎలా ప్రారంభించాలి? అందుకు సంబంధించిన చిట్కాలను ఇలా తెలుసుకోండి
మొదటి అడుగు మీ ఖర్చులను ట్రాక్ చేయడం..
ప్రతి నెలా మీరు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకోండి. దీనికోసం ఒక డైరీలో రాసుకోవచ్చు లేదా బడ్జెటింగ్ యాప్‌లు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ’50/30/20 రూల్’ పాటించవచ్చు: 50% ఆదాయం అవసరాలకు (అద్దె, ఆహారం), 30% కోరికలకు (వినోదం, షాపింగ్), 20% పొదుపు లేదా రుణాల చెల్లింపులకు కేటాయించండి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులను గుర్తించి తగ్గించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడుల కోసం 50 శాతం కేటాయించినా తప్పులేదు. ఎందుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే మీ సేవింగ్స్ ఒకే దెబ్బకు అయిపోవచ్చు. అందుకే సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం చాలా అవసరం.
YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’
పొదుపును అలవాటుగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. ప్రతినెలా జీతం రాగానే నిర్ణీత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి బదిలీ చేయండి. దీనిని ‘మిమ్మల్ని మీరు ముందుగా చెల్లించుకోవడం’ అంటారు. దీనివల్ల మీరు ఖర్చు చేయడానికి ముందుగానే పొదుపు చేస్తారు. అలాగే, చిన్న చిన్న ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయటి భోజనం తగ్గించడం, అనవసరమైన సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసుకోవడం వంటివి కూడా పెద్ద మొత్తంలో పొదుపు చేయడానికి దోహదపడతాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
చివరగా, మీ పొదుపు లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి. ఒక కారు కొనడమా, లేదా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమా? లక్ష్యం స్పష్టంగా ఉంటే పొదుపు చేయడానికి మరింత ప్రేరణ లభిస్తుంది. అలాగే, పొదుపు చేసిన డబ్బును వృద్ధి చెందేలా పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి మీ డబ్బు విలువను పెంచుతాయి. క్రమశిక్షణతో కూడిన ఈ అలవాట్లు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తాయి.
Murder of Husband : పెళ్లైన నెలకే భర్తను హత్య చేయించిన భార్య…ఛీ అసలు ఆడదేనా..?