Marriage affair: లేడీస్ బీ కేర్ ఫుల్.. పెళ్లైన వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటున్నారా?

పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం (affair) వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే ఉత్తమం.

  • Written By:
  • Updated On - February 10, 2023 / 04:10 PM IST

‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అందరికీ తెలిసిందే. అయితే ప్రేమ (Love) ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు బ్రేకప్ కు దారి తీస్తుందో చెప్పలేం. అయితే ప్రేమకు వయసు, మతం అడ్డంకి కానప్పుడు.. పెళ్లి అయిన వారి (Married Man)తో ప్రేమను కొనసాగిస్తే తప్పేంటి? అని అంటున్నారు ఈ తరం వాళ్లు. పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎందుకు ప్రేమించకూడదు అని తెగేసి మరి చెబుతున్నారు. అయితే వారితో అఫైర్ (affair) వరకు పర్వాలేదు కానీ ప్రేమిస్తే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే నని సైకాలజిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం (affair) వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే ఉత్తమం.

అనైతిక సంబంధానికి విలువ ఉండదు

పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం అనేది సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ రకమైన సంబంధం కొన్ని రోజుల వరకు బాగుంటుంది. తర్వాతే అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే వారు అటు కుటుంబానికి, ఇటు మీకు సరైన సమయాన్ని వెచ్చించలేరు. ఒకానొక సమయంలో మీరు ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అనుకున్నప్పుడు కుటుంబం (Family) వైపే మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అనైతిక సంబంధం కంటే నైతిక సంబంధానికే సమాజంలో విలువ ఉంటుందని గ్రహించి మనసు మార్చుకుని తిరిగి జీవిత భాగస్వామితోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవచ్చు.

బయట చనువుగా ఉండలేరు (No Public)

పెళ్లైన వ్యక్తులతో (affair) సంబంధమైనా, ప్రేమ అయినా దొంగచాటుగానే ఉంటుంది. శారీరకంగా ఇద్దరికి సంతృప్తి ఉన్నప్పటికీ అది మానసికంగా మారడం చాలా కష్టం. ఎందుకంటే వారు మీతో బయట చనువుగా ఉండలేరు. ఎవరైనా చూస్తారన్న భయం వారిని వెంటాడుతుంది. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లలేరు. రొమాంటిక్ గా చేతిలో చేయి వేసి నడవలేరు. మీ రొమాంటిక్ (Romantic) చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయలేరు. మొదట్లో ఇలా ఉండటం బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వెలితి, అసౌకర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని వల్ల నిరాశ పెరుగుతుంది. అది మనస్సును ముక్కలు చేస్తుంది.

సంబంధాలు అంతంతమాత్రమే

అబద్ధాలు చెప్పడం చాలా సాధారణంగా మారుతుంది. మీతో ఉన్నప్పుడు అవతలి వారితో, అవతలి వారితో ఉన్నప్పుడు మీతో అబద్ధాలు చెబుతూనే ఉంటారు. ఫోన్ (Mobiles) కు లాక్ వేయడం మొదలవుతుంది. గ్యాలరీ లాక్, యాప్ లాక్ లు పెట్టాల్సి వస్తుంది. కొత్త ఫోన్ నంబరు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒకరికొకరు కలవడానికి కూడా అబద్ధాలను ఆశ్రయించాల్సిందే.

టైం దొరకదు
పెళ్లయిన వ్యక్తితో సంబంధం కలిగి ఉండటంలో అతి పెద్ద ప్రతికూలత ఏమిటంటే వారు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో (No Time) ఉండరు. పగలు మీతో ఎంత సరదాగా గడిపినా రాత్రి అయితే ఇంటికి, పిల్లల దగ్గరకు వెళ్లాల్సిందే.

Also Read: RC15 Update: శంకర్ స్కెచ్.. పొలిటికల్ లీడర్ గా రామ్ చరణ్ !