Cool Water : ఎండలో కూల్ వాటర్ తాగుతున్నారా..? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోండి..!!

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 02:18 PM IST

వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత వారం రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుండే భానుడి భగభగమంటున్నాడు. గత వారం రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం స్టార్ట్ అయ్యాయి, ఉదయం 10 దాటినా తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు..కానీ బయటకు వెళ్లనిదే పనులు జరగవు. ఈ తరుణంలో ఎండా తీవ్రతను తగ్గించుకునేందుకు ఎక్కువగా కూల్ వాటర్ తాగుతుంటారు. కానీ ఇది చాల ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

We’re now on WhatsApp. Click to Join.

శరీర వ్యవస్థ తిన్న వాటిని జీర్ణం చేసుకునే పనిలో ఉంటుంది. అలాంటప్పుడు కూల్ వాటర్ తాగితే శరీరం చేసే తన పనిని మార్చుకుంటుంది. జీర్ణం చేసే పని కాకుండా చల్లని నీళ్లను వేడి గా మార్చే పనిలో పడుతుంది. దీనివల్ల మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు. పోషకాలు శరీరానికి అందవు. దీని కారణంగా కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. అంతే కాదు కూల్ వాటర్ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. అంటే కొన్ని సెకన్లపాటు నరాలు చల్లపడి జివ్వుమని నొప్పిపుడుతుంది. ఇలా జరిగితే బ్రెయిన్ పైనా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. ఇక నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్, పల్స్ రేటు తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందట. ఇక తిన్న వెంటనే కూల్ వాటర్ తాగితే శరీరంలోని కొవ్వు బయటికి పోదు. దాంతో బరువు పెరిగే అవకాశం ఉంది. కావున బరువు తగ్గాలనుకున్నే వాళ్ళు కూల్ వాటర్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఎండలో వెళ్లి వచ్చి వెంటనే కూల్ వాటర్ తాగకూడదు.

Read Also : Delhi Train Accident: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..